Friday, 18 September 2026 03:58:03 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

*భారత రాజ్ ప్రాథమిక హక్కులు- ప్రజాస్వామ్య లోపం * మానతలు లేని రాజ్యాంగ పరిరక్షణే కమ్యూనిస్టుల లక్ష్యం * ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల వేదిక ఆధ్వర్యంలో సెమి

Date : 21 January 2026 09:20 PM Views : 123

DNB News - తెలంగాణ / ఖమ్మం : *భారత రాజ్యాంగానికి ఎన్నెన్నో సవాళ్లు* * దేశంలో నానాటికీ పెరుగుతున్న అసమానతలు * జీవధాతువులైన ప్రాథమిక హక్కులు- ప్రజాస్వామ్య లోపం * అసమానతలు లేని రాజ్యాంగ పరిరక్షణే కమ్యూనిస్టుల లక్ష్యం * ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల వేదిక ఆధ్వర్యంలో సెమినార్ * 'భారత రాజ్యాంగం ఎదురవుతున్న సవాళ్ల'ను విశ్లేషించిన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొ.కాశీం నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి: భారత రాజ్యాంగం కులతత్వం, మతతత్వం, కార్పొరేట్ రాజకీయాల పెత్తనం, అవినీతి, లౌకికతత్వం లోపించటం, అణగారిన వర్గాల సమస్యలు, ప్రాథమిక హక్కుల అమలులో అడ్డంకులు వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్, ప్రొఫెసర్ కాశీం ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ లక్ష్యాలైన సామాజిక, ఆర్థిక న్యాయం, సమానత్వం, భిన్నత్వంలో ఏకత్వాన్ని ఇవి దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల వేదిక ఆధ్వర్యంలో స్థానిక మంచికంటి మీటింగ్ హాల్ లో బోడపట్ల రవీందర్ అధ్యక్షతన బుధవారం ఏర్పాటు చేసిన ' భారత రాజ్యాంగం- ఎదురవుతున్న సవాళ్లు'పై సెమినార్ లో కాశీం విశ్లేషించారు. భారత రాజ్యాంగానికి జీవధాతువులైన ప్రాథమిక హక్కులు- ప్రజాస్వామ్యం సందిగ్ధంలో పడినవి అన్నారు. అసమానతలు లేని రాజ్యాంగ పరిరక్షణే కమ్యూనిస్టుల లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక, లింగ, ప్రాంతం, భాష అసమానతలు లేని రాజ్యాంగాన్ని కోరుతున్నామని తెలిపారు. ప్రాథమిక హక్కులు అమలైన చోట ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని నెహ్రూ అన్న మాటలకు భిన్నమైన పరిస్థితులు నేడు ఉన్నాయన్నారు. దేశ ప్రజలకు విశ్రాంతితో జీవించే స్థితి కూడా లోపించింది అన్నారు. వర్గ అసమానతలు తగ్గించాలని రాజ్యాంగం చెబుతున్నా... నానాటికీ అవి పెరిగిపోతూనే ఉన్నాయన్నారు. పార్లమెంటరీ విధానమంటే ఓ మనిషికి ఓటు హక్కు ఉండటం, ప్రజాస్వామ్యానికి ఓటు అనేది విలువైనదై ఉండాలని చెప్పారు. ప్రతిపక్షాలు బలీయమైన శక్తిగా ఉండాలన్నారు. ప్రజాస్వామ్యం అంటే ప్రభుత్వ రూపం, సామాజిక వ్యవస్థ రూపమని పేర్కొన్నారు. అటువంటి ప్రజాస్వామ్యంలో నియంతృత్తో చట్టాలు రూపొందించకూడదని రాజ్యాంగం చెబుతోందని చెప్పారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజా చైతన్యం పరిఢవిల్లటమని అర్థం అన్నారు. కారల్ మార్క్స్ చెప్పినట్లు వర్గ రహిత సమాజం కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సమాజాన్ని విప్లవకరంగా మార్చాల్సిన బాధ్యత కమ్యూనిస్టులదేనని సూచించారు. నిస్వార్థ పోరాట చరిత్ర కమ్యూనిస్టులకే ఉందని.... నిర్బంధాలు దాడులు హత్యలు ఉన్నా కమ్యూనిస్టు సిద్ధాంతానికి చావు లేదని, అదే పెట్టుబడిదారులు, దోపిడీదారుల భయం అని పేర్కొన్నారు. చలనంలో ఉండే మెదడు సమాజం ప్రగతిదాయకంగా మారాలని ఆశిస్తుందని మార్క్స్ అన్న మాటలను గుర్తు చేశారు. * లౌకిక స్ఫూర్తిని దెబ్బతీస్తున్న కుల, మత తత్వాలు కులతత్వం, మతతత్వం: రాజ్యాంగం లౌకిక స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయన్నారు. సమాజంలో కుల, మత విభజనలను పెంచుతున్నాయని తెలిపారు. అదానీ, అంబానీ వంటి కార్పొరేట్‌ల నియంత్రణలో రాజకీయాలు ఉండటం, వారి వ్యాపార ప్రయోజనాల కోసం రాజ్యాంగ లక్ష్యాలను పక్కన పెట్టడం ఒక పెద్ద సమస్యగా సూచించారు. అవినీతి, అధికార దుర్వినియోగం ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరుస్తూ, ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన రక్షణలు సరిగా అమలు కావడం లేదన్నారు. సామాజిక వ్యవస్థ సంక్షోభంలో పడుతుందన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలను తగ్గించకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని అంబేద్కర్ రాజ్యాంగాన్ని సమర్పించే సమయంలో ఉటంకించిన వ్యాఖ్యలు నేటికీ వాస్తవ రూపాలుగానే ఉన్నాయన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం వంటి రాజ్యాంగ సూత్రాలను కార్పొరేట్ శక్తులు ప్రభావితం చేస్తున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. * రాజ్యాంగానికి స్వతంత్రత లోపం  ఎన్నికల ప్రక్రియ, పాలనలో అవినీతి పెరుగుతుందని అన్నారు.  న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం వంటి సంస్థల స్వతంత్రత లోపిస్తోందన్నారు.  పార్లమెంటరీ హక్కులు హరించి వేయబడుతున్నాయని తెలిపారు. మన విద్యలో శాస్త్రీయత లోపిస్తోందన్నారు. రాజ్యాంగపు ప్రాథమిక స్ఫూర్తిని దెబ్బతీసే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయన్నారు. రాజ్యాంగం ఆశయాలను కాపాడటం, ప్రజల భాగస్వామ్యంతో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం అవసరమని అన్నారు. ఈ సెమినార్ సందర్భంగా ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల వేదిక కోఆర్డినేషన్ కమిటీ ప్రొఫెసర్ కాశీంకు పుస్తక బహూకరణ చేసింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల వేదిక నాయకులు ఎం. సుబ్బారావు, నరేందర్, బాలాజీ సింగ్, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.

*భారత రాజ్యాంగానికి ఎన్నెన్నో సవాళ్లు* * దేశంలో నానాటికీ పెరుగుతున్న అసమానతలు * జీవధాతువులైన ప్రాథమిక హక్కులు- ప్రజాస్వామ్య లోపం * అసమానతలు లేని రాజ్యాంగ పరిరక్షణే కమ్యూనిస్టుల లక్ష్యం * ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల వేదిక ఆధ్వర్యంలో సెమినార్ * 'భారత రాజ్యాంగం ఎదురవుతున్న సవాళ్ల'ను విశ్లేషించిన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొ.కాశీం నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి: భారత రాజ్యాంగం కులతత్వం, మతతత్వం, కార్పొరేట్ రాజకీయాల పెత్తనం, అవినీతి, లౌకికతత్వం లోపించటం, అణగారిన వర్గాల సమస్యలు, ప్రాథమిక హక్కుల అమలులో అడ్డంకులు వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్, ప్రొఫెసర్ కాశీం ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ లక్ష్యాలైన సామాజిక, ఆర్థిక న్యాయం, సమానత్వం, భిన్నత్వంలో ఏకత్వాన్ని ఇవి దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల వేదిక ఆధ్వర్యంలో స్థానిక మంచికంటి మీటింగ్ హాల్ లో బోడపట్ల రవీందర్ అధ్యక్షతన బుధవారం ఏర్పాటు చేసిన ' భారత రాజ్యాంగం- ఎదురవుతున్న సవాళ్లు'పై సెమినార్ లో కాశీం విశ్లేషించారు. భారత రాజ్యాంగానికి జీవధాతువులైన ప్రాథమిక హక్కులు- ప్రజాస్వామ్యం సందిగ్ధంలో పడినవి అన్నారు. అసమానతలు లేని రాజ్యాంగ పరిరక్షణే కమ్యూనిస్టుల లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక, లింగ, ప్రాంతం, భాష అసమానతలు లేని రాజ్యాంగాన్ని కోరుతున్నామని తెలిపారు. ప్రాథమిక హక్కులు అమలైన చోట ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని నెహ్రూ అన్న మాటలకు భిన్నమైన పరిస్థితులు నేడు ఉన్నాయన్నారు. దేశ ప్రజలకు విశ్రాంతితో జీవించే స్థితి కూడా లోపించింది అన్నారు. వర్గ అసమానతలు తగ్గించాలని రాజ్యాంగం చెబుతున్నా... నానాటికీ అవి పెరిగిపోతూనే ఉన్నాయన్నారు. పార్లమెంటరీ విధానమంటే ఓ మనిషికి ఓటు హక్కు ఉండటం, ప్రజాస్వామ్యానికి ఓటు అనేది విలువైనదై ఉండాలని చెప్పారు. ప్రతిపక్షాలు బలీయమైన శక్తిగా ఉండాలన్నారు. ప్రజాస్వామ్యం అంటే ప్రభుత్వ రూపం, సామాజిక వ్యవస్థ రూపమని పేర్కొన్నారు. అటువంటి ప్రజాస్వామ్యంలో నియంతృత్తో చట్టాలు రూపొందించకూడదని రాజ్యాంగం చెబుతోందని చెప్పారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజా చైతన్యం పరిఢవిల్లటమని అర్థం అన్నారు. కారల్ మార్క్స్ చెప్పినట్లు వర్గ రహిత సమాజం కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సమాజాన్ని విప్లవకరంగా మార్చాల్సిన బాధ్యత కమ్యూనిస్టులదేనని సూచించారు. నిస్వార్థ పోరాట చరిత్ర కమ్యూనిస్టులకే ఉందని.... నిర్బంధాలు దాడులు హత్యలు ఉన్నా కమ్యూనిస్టు సిద్ధాంతానికి చావు లేదని, అదే పెట్టుబడిదారులు, దోపిడీదారుల భయం అని పేర్కొన్నారు. చలనంలో ఉండే మెదడు సమాజం ప్రగతిదాయకంగా మారాలని ఆశిస్తుందని మార్క్స్ అన్న మాటలను గుర్తు చేశారు. * లౌకిక స్ఫూర్తిని దెబ్బతీస్తున్న కుల, మత తత్వాలు కులతత్వం, మతతత్వం: రాజ్యాంగం లౌకిక స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయన్నారు. సమాజంలో కుల, మత విభజనలను పెంచుతున్నాయని తెలిపారు. అదానీ, అంబానీ వంటి కార్పొరేట్‌ల నియంత్రణలో రాజకీయాలు ఉండటం, వారి వ్యాపార ప్రయోజనాల కోసం రాజ్యాంగ లక్ష్యాలను పక్కన పెట్టడం ఒక పెద్ద సమస్యగా సూచించారు. అవినీతి, అధికార దుర్వినియోగం ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరుస్తూ, ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన రక్షణలు సరిగా అమలు కావడం లేదన్నారు. సామాజిక వ్యవస్థ సంక్షోభంలో పడుతుందన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలను తగ్గించకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని అంబేద్కర్ రాజ్యాంగాన్ని సమర్పించే సమయంలో ఉటంకించిన వ్యాఖ్యలు నేటికీ వాస్తవ రూపాలుగానే ఉన్నాయన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం వంటి రాజ్యాంగ సూత్రాలను కార్పొరేట్ శక్తులు ప్రభావితం చేస్తున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. * రాజ్యాంగానికి స్వతంత్రత లోపం  ఎన్నికల ప్రక్రియ, పాలనలో అవినీతి పెరుగుతుందని అన్నారు.  న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం వంటి సంస్థల స్వతంత్రత లోపిస్తోందన్నారు.  పార్లమెంటరీ హక్కులు హరించి వేయబడుతున్నాయని తెలిపారు. మన విద్యలో శాస్త్రీయత లోపిస్తోందన్నారు. రాజ్యాంగపు ప్రాథమిక స్ఫూర్తిని దెబ్బతీసే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయన్నారు. రాజ్యాంగం ఆశయాలను కాపాడటం, ప్రజల భాగస్వామ్యంతో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం అవసరమని అన్నారు. ఈ సెమినార్ సందర్భంగా ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల వేదిక కోఆర్డినేషన్ కమిటీ ప్రొఫెసర్ కాశీంకు పుస్తక బహూకరణ చేసింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల వేదిక నాయకులు ఎం. సుబ్బారావు, నరేందర్, బాలాజీ సింగ్, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: