DNB News - తెలంగాణ / : ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మధ్యప్రాచ్య (పశ్చిమ ఆసియా) ప్రాంతంలోని కొన్ని దేశాల్లో ఏర్పడుతున్న పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం సమగ్రంగా పర్యవేక్షిస్తోంది. న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు సంబంధిత భారత రాయబార కార్యాలయాలతో ఇప్పటికే నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితులను అంచనా వేస్తున్నారు. ఆయా దేశాల్లో నివసిస్తున్న,చిక్కుకున్న తెలంగాణ పౌరులు మరియు వారి కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న విచారణలను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ ప్రభుత్వం న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. అవసరమైన సమన్వయం మరియు సహాయం అందించేందుకు ఈ కంట్రోల్ రూమ్ పనిచేస్తుంది. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ పౌరులు లేదా తెలంగాణలో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు, ప్రయాణ అంతరాయాలు లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఈ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చు. 24×7 కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు (న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్ నుంచి పనిచేస్తుంది) శ్రీమతి వందన బరువా పీఎస్ టు రెసిడెంట్ కమిషనర్ & లైజన్ హెడ్ +91 9871999044
Admin
DNB News