DNB News - తెలంగాణ / : బోరబండ శిల్పినగర్లో దారుణ ఘటన వెలుగుచూసింది. మద్యం మత్తులో ఐదేళ్ల కుమారుడు విజయ్ (5) గొంతు నులిమి తండ్రి విద్యాసాగర్ (36) హత్య చేసినట్లు సమాచారం. గత రాత్రి 10 గంటల సమయంలో ఘటన జరగగా క్యాటరింగ్ పనికి వెళ్లిన తల్లి దుర్గ తెల్లవారుజామున ఇంటికి వచ్చి చూడగా బాలుడు అనుమానాస్పద స్థితిలో విగతాజీవిగా కనిపించాడు. పొరుగువారికి సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు..!!
Admin
DNB News