DNB News - తెలంగాణ / : ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గీతారెడ్డి హాస్టల్లో ఉప్పల్ డివిజన్ షీ టీమ్స్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళా రక్షణ, సైబర్ నేరాలు, లోన్ యాప్ మోసాలు, మానవ అక్రమ రవాణా, బాల్య వివాహాలు అంశాలపై కేస్ స్టడీస్ ద్వారా అవగాహన కల్పించారు. ఆపదలో ఉన్నప్పుడు సంకోచించకుండా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. అత్యవసర సహాయం కోసం డయల్ 112 కాల్ చేయాలని కోరారు..!!
Admin
DNB News