Monday, 02 November 2026 11:03:20 AM
# బోరబండలో బిడ్డను చంపిన తండ్రి..? # ఏడాదికి రూ.12వేలు.. NOV 15 వరకు ఛాన్స్..!! # రోహిత.. నువ్వు గ్రేట్ తల్లి..!! # హైదరాబాద్ లో ఇలాంటి ఫుడ్ ఆహ్..? # హైదరాబాద్ లో 36 గంటలు వాటర్ బంద్..!! # తెలంగాణలో పెరిగిన కరెంట్ బిల్లులు..!! # తెలంగాణలో సన్నబియ్యం గరిష్ట ధరలు ఫిక్స్..!! # హైదరాబాద్ లో అక్కడ ఫ్రీ WiFi.. ఫుల్ స్పీడ్..!! # నల్గొండ క్రాస్ రోడ్డులో సోహైల్ హోటల్ సీజ్..!! # డ్రైవింగ్ లైసెన్స్.. ఇక NO టెన్షన్..!! # పెరుగుతున్న అరాచకాలు.. సినిమాల్లో హింస ఓక కారణమా..? # బురఖాలో వచ్చి చోరీలు చేస్తున్న మహిళ అరెస్ట్..!! # ఏసీబీకి చిక్కిన మరో అధికారి..!! # ఒక వ్యక్తి ఖాతాలోకి ₹1,00,00,00,00,000..ట్విస్ట్..!! # హైదరాబాద్ లో వర్షం.. నాలాలో పడిన డెలివరీ బాయ్..!! # శబరిమల భక్తులకు రూ.2 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్..!! # పోలీస్ సంక్షేమ నిధుల దుర్వినియోగం.. ఇద్దరి అరెస్ట్..!! # సూపర్ ఎల్నినో.. నేడు హైదరాబాద్లో కీలక సదస్సు..!! # బాలికపై తండ్రి దాడి..ఆటోనగర్ లోని కృష్ణారెడ్డి నగర్ లో తండ్రి చేతిలో గాయపడ్డ కూతురు లక్ష్మీ ప్రణీత (16)..!! # పటాన్చెరు PS నుంచి నిందితుల పరారీ..?

సినీ నటుడు మురళీధర్ గౌడ్ ఇంట విషాదం

Date : 07 March 2026 04:16 PM Views : 230

DNB News - తెలంగాణ / : మురళీధర్ భార్య ఐరేని శశికళ(58) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ గురువారం మరణించారు. ఈ ఘటనతో మురళీధర్ గౌడ్ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. గతంలో రామాయంపేట గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో ఆమె వార్డు సభ్యురాలిగా ఎన్నికై ప్రజలకు సేవలు అందించారు. విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మురళీధర్ గౌడ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో పని చేసి రిటైర్ అయిన తర్వాత నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టారు. 2018లో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాతో ఆయన సినిమా ప్రయాణం ప్రారంభమైంది. తర్వాత 2022లో విడుదలైన ‘డీజే టిల్లు’ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ తండ్రి పాత్రలో నటించి మంచి గుర్తింపు పొందారు. ఆ తరువాత ‘బలగం’ సినిమా ఆయనకు మరిన్ని అవకాశాలను తెచ్చిపెట్టింది. ‘మేము ఫేమస్’, ‘మ్యాడ్’, ‘టిల్లు స్క్వేర్’ వంటి సినిమాలతో కూడా ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: