Monday, 03 August 2026 09:24:52 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్‌ తో బాధితుల వద్దకే వెళ్లి సత్వర న్యాయం.

Date : 05 April 2026 05:07 PM Views : 72

DNB News - తెలంగాణ / : మహబూబాబాద్ జిల్లా ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్‌ తో బాధితుల వద్దకే వెళ్లి సత్వర న్యాయం. బాధితులు ఈ సేవను వినియోగించుకోవాలి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 35 కేసులు నమోదు – జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ బాధితులకు సత్వర న్యాయం అందించాలనే లక్ష్యంతో మహబూబాబాద్ జిల్లా పోలీసులు అమలు చేస్తున్న “ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్” విధానం ద్వారా ప్రజలకు మరింత చేరువగా పోలీస్ సేవలు అందుతున్నాయి. పోలీస్ స్టేషన్‌కు రాలేని పరిస్థితుల్లో ఉన్న బాధితులు స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేకుండా, పోలీసులు స్వయంగా ఘటన స్థలానికి లేదా బాధితుని వద్దకు వెళ్లి ఫిర్యాదు నమోదు చేయడం ఈ విధానం ప్రత్యేకత. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 35 ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ విధానం వల్ల బాధితులకు తక్షణ న్యాయం అందడమే కాకుండా, పోలీస్ సేవలపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతోందని అన్నారు. ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగల ప్రధాన అంశాలు : 1. మహిళలు మరియు చిన్నారులపై నేరాలు 2. లైంగిక నేరాలు (POCSO, అత్యాచారం తదితరాలు) 3. ఎస్సీ / ఎస్టీ అఘాయిత్యాలు 4. ఆస్తి సంబంధిత నేరాలు (చోరీ, దోపిడీ) 5. వృద్ధులపై నేరాలు 6. ప్రత్యేక చట్టాల కింద కేసులు (డౌరీ, చైల్డ్ మ్యారేజ్, ర్యాగింగ్ మొదలైనవి) 7. పోలీస్ స్టేషన్‌కు రాలేని పరిస్థితిలో ఉన్న బాధితులకు సంబంధించిన ఇతర నేరాలు ప్రత్యేకించి మహిళలు, వృద్ధులు మరియు దూర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఈ సేవ ఎంతో ఉపయోగకరంగా నిలుస్తోందని ఎస్పీ తెలిపారు. బాధితుని వద్దకే చేరుకుని ఫిర్యాదు నమోదు చేయడం ద్వారా సమయాన్ని ఆదా చేయడంతో పాటు, నేరాలపై వేగంగా చర్యలు తీసుకునే అవకాశం కలుగుతోందని పేర్కొన్నారు. “బాధితులకు సత్వర న్యాయం అందించడమే పోలీస్ శాఖ లక్ష్యం. ప్రజలకు చేరువగా ఉండే పోలీసింగ్‌ ద్వారా వారి సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నాము,” అని జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా ప్రజలు ఈ సేవను వినియోగించుకుని నిర్భయంగా ముందుకు వచ్చి పోలీసులను సంప్రదించాలని ఎస్పీ కోరారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: