DNB News - తెలంగాణ / : ప్రపంచ గ్లకోమా వారోత్సవాల సందర్భంగా బుధవారం కర్నూలు ప్రభుత్వ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కంటి ఆసుపత్రి నుండి రాజవిహార్ సెంటర్ వరకు నిర్వహించిన వాకథాన్ ర్యాలీని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ గ్లకోమా (కంటి నరాల నష్టం) ఒక ప్రమాదకరమైన కంటి వ్యాధి అని, దీనిని సమయానికి గుర్తించకపోతే చూపు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి ప్రజలు కంటి పరీక్షలను నిరంతరం చేయించుకోవాలని, చిన్న లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. ప్రభుత్వ కంటి ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, విద్యార్థులు మరియు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్న ఈ ర్యాలీలో గ్లకోమా వ్యాధి నివారణ, ముందస్తు పరీక్షల ప్రాముఖ్యతపై నినాదాలు చేశారు. ప్రజల్లో కంటి ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News