DNB News - తెలంగాణ / : భాజా భజంత్రీలతో.....కనీవినీ ఎరగని రీతిలో సక్సెస్ చేద్దాం.... 14న పొద్దున్నే 6 గంటలకే చేరుకుందాం టెన్త్ పరీక్షా విద్యార్ధులకు ఇబ్బంది లేకుండా చేద్దాం... వేలాది మందితో కలిసి బండి సంజయ్ మహా పాదయాత్ర బీజేపీ సీనియర్ నేతల భేటీ అంజన్న ఆశీర్వాద యాత్ర సక్సెస్ కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ‘‘అంజన్న ఆశీర్వాద యాత్ర’’ పేరిట ఈనెల 14న జరపతలపెట్టిన ‘‘మహా పాదయాత్ర’’కు మేము సైతం అంటూ బీజేపీ శ్రేణులు తరలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ‘‘అంజన్న ఆశీర్వాద యాత్ర’’ సజావుగా సాగేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఈరోజు (మంగళవారం) సాయంత్రం కరీంనగర్ లో బీజేపీ నాయకులు సమావేశమయ్యారు. బీజేపీ సీనియర్ నేత డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల ఇంఛార్జీ భండారి శాంతికుమార్, మోహన్ రెడ్డి, ఆయా జిల్లాల అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపీ, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 14న చేపట్టే ‘‘అంజన్న ఆశీర్వాద యాత్ర’’లో ఎదురైన సమస్యలపై చర్చించారు. ప్రధానంగా 10వ తరగతి విద్యార్ధులు వార్షిక పరీక్షలు జరుగుతున్నందున....పాదయాత్ర సందర్భంలో రోడ్డుపై ట్రాఫిక్ జాం కాకుండా చర్యలు తీసుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు వినతి పత్రం అందజేయాలని నిర్ణయానికి వచ్చారు. అదే సమయంలో 14న (శనివారం) ఉదయం 6 గంటలకే మహాశక్తి ఆలయానికి చేరుకునేలా మీడియా, సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరికీ సమాచారం ఇవ్వాలని తీర్మానించారు. అంజన్న ఆశీర్వాద యాత్రలో పాల్గోనేందుకు పెద్ద ఎత్తున హనుమాన్ భక్తులు, బీజేపీ శ్రేణులు, కాషాయ దళం తరలి వచ్చే అవకాశం ఉందని... ఇప్పటికే కరీంనగర్ లోని ‘‘మేం కూడా పాల్గొంటాం’’ అంటూ పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు, హిందుత్వ వాదులు, భక్తమండళ్ల సభ్యులు, స్వచ్ఛంద సంస్థల సభ్యుల నుండి ఫోన్లు వస్తున్నాయని స్థానిక కార్పొరేటర్, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ కుమార్ సమావేశంలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి, శాంతి కుమార్ మాట్లాడుతూ ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’’లో పాల్గొనే ప్రతి ఒక్కరికీ కేంద్ర మంత్రి బండి సంజయ్ తో కలిసి అడుగులో అడుగు వేసే అవకాశాన్ని కల్పించేలా ఏర్పాట్లు చేయాలని ఆయా జిల్లాల అధ్యక్షులను కోరారు. ముఖ్యంగా బీజేపీలో బూత్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నాయకులే కాకుండా భక్తమండళ్లు, హిందుత్వ వాదులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు సైతం ఈ పాదయాత్రలో బండి సంజయ్ తో కలిసి నడుస్తామంటూ పెద్ద ఎత్తున ఫోన్లు వస్తున్నాయంటూ.... సమావేశంలో పలువురు ప్రస్తావించగా...’’రాజకీయాలకు అతీతంగా ఆధ్యాత్మిక భావన పెంపొందించేలా భక్తి పాటలు, డీజే సౌండ్, డప్పు సప్పుళ్లతో నభూతో నభవిష్యత్ అనేలా ‘‘అంజన్న ఆశీర్వాద యాత్ర’’ను విజయవంతం చేయాలన్నదే బండి సంజయ్ గారి ఆలోచన’’. అందుకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకుందాం’’ అంటూ శాంతి కుమార్ తెలిపారు. అంజన్న ఆశీర్వాద యాత్రలో పాల్గొనే వారందరికీ ఆద్యంతం ఇబ్బందుల్లేకుండా భోజన, ఇతరత్రా సౌకర్యాలు కల్పించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అదే సమయంలో యాత్ర ఆరంభం మొదలు కొండగట్టు అంజన్న ఆలయ సన్నధికి చేరే వరకు ప్రతి ఒక్కరి మదిలో మెదిలేలా ‘‘అలంకంరణ’’ ఏర్పాట్లు చేయాలని కూడా నిర్ణయించారు. కరీంనగర్ మహాశక్తి ఆలయం నుండి బయలు దేరినప్పటి నుండి కొండగట్టు అంజన్న సన్నిధికి చేరే వరకు...... ప్రతి ఊరిలో, ప్రతి మండల కేంద్రంలో ‘‘అంజన్న ఆశీర్వాద యాత్ర’’కు భాజీ భజంత్రీలతో ఘన స్వాగతం పలికేలా చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పాదయాత్ర ప్రారంభమయ్యేదిలా.... 14న ఉదయం 7 గంటలకు కరీంనగర్ లోని మహాశక్తి ఆలయం నుండి ఈ మహా పాదయాత్ర ప్రారంభమవుతుంది. రేకుర్తి, కొత్తపల్లి, గంగాధర, పూడూరు, కొడిమ్యాల, మల్యాల మీదుగా కొండగట్టు అంజన్న ఆలయం వద్దకు చేరుకుంటారు. దాదాపు 40 కి.మీల మేరకు కాలి నడకన వెళ్లి కొండగట్టు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు. మరోవైపు నూతన ప్రజాప్రతినిధులతో కలిసి బండి సంజయ్ పాదయాత్రకు వస్తుండటంతో... ఆయా గ్రామాల్లోని, కాషాయ కార్యకర్తలు, హిందుత్వ వాదుల్లో జోష్ నెలకొంది. సంజయ్ పాదయాత్రకు మంగళహారతులు, పూలతో ఘన స్వాగతం పలకాలని నిర్ణయించారు. వేసవి కాలం ప్రారంభం కావడంతో దారిపొడవునా పాదయాత్ర చేసే కార్యకర్తలు మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లతోపాటు అవసరమైన మేరకు పులిహోర ప్యాకెట్లను కూడా సిద్ధం చేయనున్నారు. ఈ పాదయాత్రలో పలు స్వచ్ఛంద సంస్థలు, భక్త మండళ్లు సైతం ఈ పాదయాత్రలో పాల్గొనే వారికి తమ వంతు సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధమయ్యాయి.
Admin
DNB News