DNB News - తెలంగాణ / : జిల్లాలో పర్యటిస్తున్న తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు ఖమ్మం రూరల్ KGBV పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో విడివిడిగా మాట్లాడి, వారికి అందుతున్న సౌకర్యాలు, విద్యా స్థాయి, మరియు వారి సమస్యల గురించి తెలుసుకున్నారు. పిల్లలకు బాలల హక్కులు, రక్షణ చట్టాలపై అవగాహన కల్పిస్తూ, వారి పరిజ్ఞానాన్ని కూడా పరిశీలించారు. తరగతి గదులు మరియు వసతి గృహాన్ని సందర్శించిన కమిషన్ సభ్యులు, విద్యార్థినులకు అందుతున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ‘చిన్నారి’ కార్యక్రమంపై ప్రశంసలు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా శక్తి కేంద్రాలు మరియు జిల్లా బాలల పరిరక్షణ విభాగం ద్వారా అమలు చేస్తున్న ‘చిన్నారి’ కార్యక్రమంపై కమిషన్ సభ్యులు వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాలలు, కళాశాలల్లోని బాలికలకు లైంగిక దుర్వినియోగాలపై అవగాహన కల్పించడం, రక్షణ చర్యలను తెలియజేయడం వంటి చర్యలను అభినందించారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నందుకు జిల్లా కలెక్టర్ శ్రీ అనుదీప్ దురిశెట్టి, అడిషనల్ కలెక్టర్ కుమారి శ్రీజ మరియు జిల్లా యంత్రాంగాన్ని కమిషన్ సభ్యులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాలల పరిరక్షణ కమిషన్ సభ్యులు శ్రీమతి చందన, సరిత, జిల్లా సంక్షేమ అధికారిని శ్రీమతి వేల్పుల విజేత, జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. రామరావు , జిల్లా విద్యా శాఖ అధికారి చైతన్య జైని, జిల్లా బాలల సంరక్షణ అధికారి విష్ణు వందన, జిల్లా హబ్ కోఆర్డినేటర్ సమ్రీన్, రఘునాధపాలెం MPDO ఆషిక్ కుమార్, ఖమ్మం అర్బన్ CDPO వీరభద్రమ్మ, ఖమ్మం రూరల్ CDPO కమల ప్రియా, GCDO రూబీ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News