DNB News - తెలంగాణ / : హోంగార్డ్స్ నుంచి ఐపీఎస్‌ల వరకు కఠిన ఆదేశాలు… యూనిఫామ్, అవినీతి రెండూ కలిసి ఉండలేవు.. ఒంటిపై ఖాకీ డ్రెస్ ఉన్నప్పుడు.. మనసులో అవినీతి ఆలోచనకు చోటు ఉండకూడదు. శాంతి భద్రతలు కాపాడాల్సిన వారే అక్రమ సంపాదనకు అలవాటు పడితే, వ్యవస్థకు అంతకంటే చేటు మరొకటి లేదు. బాధ్యత మరవకండి..! దారి తప్పకండి..! కొరడాతో ACB సిద్ధంగా ఉంది అంటూ... డిపార్ట్‌మెంట్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పోలీస్ బాస్ శివధర్ రెడ్డి. యూనిఫామ్, అవినీతి రెండూ కలిసి ఉండలేవు..! ఒంటిపై ఖాకీ డ్రెస్ ఉన్నప్పుడు.. మనసులో అవినీతి ఆలోచనకు చోటు ఉండకూడదు. శాంతి భద్రతలు కాపాడాల్సిన వారే అక్రమ సంపాదనకు అలవాటు పడితే, వ్యవస్థకు అంతకంటే చేటు మరొకటి లేదు. బాధ్యత మరవకండి..! దారి తప్పకండి..! కొరడాతో ACB సిద్ధంగా ఉంది అంటూ… డిపార్ట్‌మెంట్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పోలీస్ బాస్ శివధర్ రెడ్డి. ఈ మధ్య వరుస దాడుల్లో పోలీసు సిబ్బంది ACBకి పట్టుడుతున్నారు. ఈ ఘటనలు పోలీస్ శాఖ ప్రతిష్టను మంటగలిపేలా ఉండటంతో డీజీపీ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు అక్రమ సంపాదనకు అలవాటు పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు చేశారు. హోమ్ గార్డ్ నుండి IPS వరకు అందరూ బాధ్యతతో పని చేయాలని DGP శివధర్ రెడ్డి సూచించారు. నిజాయితీతో విధులు నిర్వహించాలని గానీ.. దారితప్పి లంచం తీసుకుంటే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ఫెయిర్, ఫర్మ్, ఫ్రెండ్లీ, ప్రొఫెషనల్.. ఇదే పోలీసుల లక్ష్యమంటూ సిబ్బందికి గుర్తుచేశారు.
Admin
DNB News