DNB News - తెలంగాణ / : కీసర ఘట్కేసర్ ORR బైపాస్ రాంపల్లి దాయర-కరీంగూడ పరిధిలోని బ్రిడ్జి కింద ఓ ట్రాన్స్ జెండర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా, మృతురాలు మేడ్చల్ జిల్లా కీసర మండలం బోగారానికి చెందిన స్వీటీ (శేఖర్) గా గుర్తించినట్లు సమాచారం. ఆమె వయస్సు సుమారు 30-35 ఏళ్లు ఉంటుందని తెలుస్తోంది. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. క్లూస్ టీం సహాయంతో కీసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..!!
Admin
DNB News