Saturday, 31 October 2026 03:01:30 AM
# జర్నలిస్టులకు తీపి కబురు # లోన్ రికవరీ వేధింపులు.. భార్యకు న్యూడ్ ఫొటోలు పంపి..!! # టోల్‌ప్లాజాల 20 కి.మీ పరిధి నివాసులకు రాయితీ # JNTUHలో కూరలో బల్లి.. విద్యార్థుల ఆగ్రహం..!! # నీళ్లు వృథా చేస్తే భారీ ఫైన్, కనెక్షన్ కట్..!! # పుల్లారెడ్డి స్వీట్స్ లైసెన్స్ సస్పెన్షన్ – ఇలా తయారు చేస్తారా..? # బాలిక గొంతు నులిమి చంపిన తల్లి.. ఎందుకంటే..!! # CBSE కొత్త విధానం.. ఒక సబ్జెక్ట్ ఫెయిలైనా టెన్త్ పాస్..!! # నిమ్స్ లో అవినీతి పై ఉక్కుపాదం..!! # రూత్ సంకల్పం ఎందరికో స్ఫూర్తిదాయకం : హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ # నిరాడంబ‌రంగా మంత్రి పొంగులేటి పుట్టిన‌రోజు ఎల్‌నినో నేపథ్యంలో ఆడంబ‌రాలకు దూరం # హైదరాబాద్ లో 25KGల బ్యాగులో 22 KGల బియ్యం..!! # ఉద్యోగానికి ఎంపికై ఆరు నెలలు అయినా నియామక ఉత్తర్వులు ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం..!! # 20 వేల లంచం.. లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్, పెట్రోల్ బంక్ టెక్నీషియన్ అరెస్ట్..!" # ఢిల్లీ వేదికగా 12వ బ్రిక్స్ పార్లమెంటరీ సదస్సు..!! # రాత్రివేళ రైళ్లలో మొబైల్ ఛార్జింగ్ పై నిషేధం..!! # రేషన్ లబ్ధిదారులకు మరో 6 నిత్యావసరాలు..? # రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా కీలకమైనవని... మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. # సైనిక్ పురిలో ఈ-సిగరెట్ల ముఠా గుట్టురట్టు..!! # హైదరాబాద్లో ఆల్ ఇండియా పోలీస్ T20 క్రికెట్ టోర్నీ..!!

తెలంగాణ రేషన్ షాపుల్లో సబ్సిడీపై నిత్యావసర సరుకులు.. ప్రభుత్వం కీలక ప్రతిపాదన..!!

Date : 23 October 2026 03:57 PM Views : 33

DNB News - తెలంగాణ / : తెలంగాణలో సామాన్య ప్రజలకు ఊరట కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదనను పరిశీలిస్తోంది. రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు పలు నిత్యావసర సరుకులను సబ్సిడీ ధరలకు అందించే అంశంపై కసరత్తు చేస్తోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే రేషన్ షాపుల ద్వారా గోధుమపిండి, కందిపప్పు, పామాయిల్, చక్కెర, చింతపండు, కారం పొడి వంటి సరుకులు కూడా తక్కువ ధరలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ అంశంపై సచివాలయంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సరుకుల ధరలు, పంపిణీ చేసే పరిమాణం, అమలు విధానంపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. అధికారుల నివేదిక ఆధారంగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే, ఈ ప్రతిపాదనపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు స్పష్టమవుతాయి..!!

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :