DNB News - తెలంగాణ / : కూకట్పల్లి JNTUHలోని మంజీర హాస్టల్లో విద్యార్థులకు వడ్డించిన కూరలో బల్లి కనిపించడం కలకలం రేపింది. గురువారం రాత్రి భోజనం చేసేందుకు వెళ్లిన విద్యార్థులు కూరలో బల్లిని గుర్తించి వీడియో తీశారు. ఆహారంలో బల్లి కనిపించడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్లో నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం అందించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. దీనిపై అధికారులు స్పందించాల్సి ఉంది..!!
Admin
DNB News