DNB News - తెలంగాణ / : మునగాల:నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. హైదరాబాద్ శ్రీకర ఆసుపత్రి నిపుణులు ఆర్థోపెడిక్ సేవలు అందించగా, సూర్యాపేట లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యులు ఇరువురు కలిసి 485 మంది రోగులను పరిక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఖరీదైన వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందించడం గొప్ప విషయమని అందుకుగాను ఎంతో సేవ చేస్తున్న ట్రస్ట్ సభ్యులను కొనియాడారు. ఈ సందర్భంగా వైద్యులు భరత్ రెడ్డి, కృష్ణ చైతన్యాలను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పైడిమరి సత్తిబాబు, ట్రస్ట్ అధ్యక్షులు నీలా సత్యనారాయణ,ప్రధాన కార్యదర్శి చారుగుండ్ల ప్రవీణ, రాజశేఖర్,ఓరుగంటి కిట్టు,సంయుక్త కార్యదర్శి యాదా సుధాకర్,ట్రస్ట్ స్వయం సేవక్ సభ్యులుచీదేళ్ళహనుమంతరావు,దేవరశెట్టిశంకర్రావు,కాళంగి వెంకటేశ్వర్లు,నాగుబండి పురుషోత్తం, పొత్తుమూర్తు విద్యాసాగర్, ట్రస్ట్ సందానకర్త వెంపటి వెంకట రమణ,వంగవీటి రంగారావు,ట్రస్ట్ యువత విభాగం నాయకులు గుడుగుంట్ల సాయి,పైడిమర్రి సతీష్,మహిళా విభాగ నాయకులు వంకాయల స్వాతి, వంగవీటి సత్య,నాగరాని. అన్నం పుష్ప, కోత్తూరి విజయ,కందిబండ విజయ, నాగుబండి రమాదేవి, తదితరులు పాల్గొనారు.
Admin
DNB News