DNB News - ఆంధ్రప్రదేశ్ / : రాప్తాడు ఘటన నిందితుడు హేమంత్ కోసం 25 బృందాలతో గాలించినట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో హేమంతు అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో సీఐపై కత్తితో దాడికి యత్నించినట్లు వెల్లడించారు. ముందుగా హెచ్చరించినా తప్పని పరిస్థితుల్లో కాల్పులు జరపాల్సి వచ్చిందని వివరించారు. ఆరు రౌండ్లు కాల్పులు జరిపామన్నారు. ఘటనతో భయాందోళనకు గురైన విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు..!!
Admin
DNB News