DNB News - ఆంధ్రప్రదేశ్ / : కలెక్టరేట్‌లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, పునరావాసంపై జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి నిర్వహించారు. ఈ సందర్భంగా బాల కార్మికులను గుర్తించి వెంటనే విముక్తి కల్పించడంతో పాటు వారికి విద్య, పునరావాస సదుపాయాలు అందించాలన్నారు. చట్టాలను కఠినంగా అమలు చేసి బాల కార్మిక వ్యవస్థకు పూర్తిస్థాయి స్వస్తి పలకాలని అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల సమన్వయంతో నిరంతర తనిఖీలు చేపట్టి బాలల హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.
Admin
DNB News