DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఎమ్మిగనూరు పట్టణంలోని శ్రీ కోతుల బావి ఆంజనేయస్వామి గుడి స్థలానికి అడ్డంగా మున్సిపల్ కమిషనర్ రెండున్నర నెలల క్రితం నాపరాళ్లతో ప్రహరీని అక్రమంగా నిర్మించారని “శ్రీ హనుమ కరసేవ” కార్యకర్త కసిరెడ్డి ఉపేంద్ర రెడ్డి ఆరోపించారు. హిందువులు వ్యతిరేకించినప్పటికీ పోలీసు బందోబస్త్ మధ్య ఆ నిర్మాణం చేపట్టారని తెలిపారు. గుడి స్థలంలో గుడికి చెందిన బండలతో నిర్మించిన ఆ ప్రహరీ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని పేర్కొన్నారు. ప్రహరీ తొలగించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు స్పందించలేదన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 14వ తేదీ ఉదయం 10:30 గంటలకు “శ్రీ హనుమ కరసేవ” కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని సంబంధిత ఉన్నతాధికారులకు అందజేశామని, పోలీసు బందోబస్త్ కోసం చలానా కూడా చెల్లించినట్లు తెలిపారు. హిందువులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని క్రమశిక్షణతో “శ్రీ హనుమ కరసేవ”ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కసిరెడ్డి ఉపేంద్ర రెడ్డి “శ్రీ హనుమ కరసేవ” కార్యకర్త, ఎమ్మిగనూరు.
Admin
DNB News