DNB News - ఆంధ్రప్రదేశ్ / : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద సోమవారం కర్నూలు నగరంలోని దేవనగర్ ప్రాంతంలో జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్ మొత్తాన్ని అందజేస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. పెన్షన్ పొందిన వృద్ధులు, వికలాంగులు, ఇతర లబ్ధిదారులు ప్రభుత్వం తమ ఇంటి వద్దకే పెన్షన్ అందజేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పారదర్శకంగా సేవలు అందిస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.
Admin
DNB News