Tuesday, 15 September 2026 11:49:54 PM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

ISPL టోర్నమెంట్‌లో సందడి చేసిన ఎమ్మెల్యే పార్థసారథి.. క్రీడాకారులకు ప్రోత్సాహం..

Date : 05 June 2026 07:50 AM Views : 154

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో క్రీడాకారులు ఎదుర్కొంటున్న క్రీడా మైదానాల కొరతను త్వరలోనే శాశ్వత ప్రాతిపదికన పరిష్కరిస్తామని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి హామీ ఇచ్చారు. గురువారం ఆదోనిలో నిర్వహించిన ‘ISPL ఆదోని క్రికెట్ టోర్నమెంట్’ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన క్రీడాకారులను అభినందించి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా బ్యాట్ చేతబట్టి క్రికెట్ ఆడుతూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు. ఎమ్మెల్యే బ్యాటింగ్ చేయడం చూసిన యువ క్రీడాకారులు, ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆదోనిలో క్రీడలకు, ముఖ్యంగా క్రికెట్‌కు విశేష ఆదరణ ఉన్నప్పటికీ యువతకు సరిపడా క్రీడా మైదానాలు లేకపోవడం విచారకరమన్నారు. ఈ సమస్యను గుర్తించి, క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్రీడలు యువతలో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్న ఎమ్మెల్యే, యువత వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. స్థానిక క్రీడాకారులను ప్రోత్సహించేందుకు టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు, క్రీడాభిమానులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :