DNB News - ఆంధ్రప్రదేశ్ / : 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ శిరీష చేతుల మీదుగా ఆదోని మూడవ పట్టణ సీఐ పి. రామలింగయ్య ఉత్తమ అధికారిగా ప్రశంస పత్రాన్ని అందుకోవడం గర్వకారణంగా నిలిచింది. ప్రజల శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ, పోలీస్ శాఖకు గౌరవాన్ని తెచ్చినందుకు ఈ పురస్కారం అందించారు. ఇది వారి కర్తవ్యనిష్టకు దక్కిన గౌరవంగా భావించవచ్చు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, సహచరులు, ప్రజాప్రతినిధులు సీఐ రామలింగయ్య కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
Admin
DNB News