Sunday, 02 August 2026 10:42:14 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో పాలన

వైసిపి యువనేత తమ్మినేని చిరంజీవి నాగ్

Date : 04 February 2026 09:41 AM Views : 144

DNB News - ఆంధ్రప్రదేశ్ / : రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలనకు బదులు రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా కూటమి ప్రభుత్వం అరాచకంగా పాలన సాగిస్తోందని వైసీపీ యువ నాయకులు తమ్మినేని చిరంజీవి నాగ్ విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని పరిరక్షించవలసిన బాధ్యత పోలిసుల పై ఉందని స్థానిక వైస్సార్ పార్టీ నాయకులతో కలసి ఆమదాలవలస పోలీస్ స్టేషన్ లో వినతి పత్రం సమర్పించిన వైస్సార్ పార్టీ యువ నాయకులు తమ్మినేని చిరంజీవి నాగ్ ప్రతిపక్ష నేతలపై జరుగుతున్న భయానకరమైన దాడులే ఇందుకు నిదర్శనమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.పవిత్రమైన తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ సహా కూటమి నేతలు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, దర్యాప్తు సంస్థలు కోర్టుకు సమర్పించిన చార్జీషీట్‌లో జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టంగా నిర్ధారించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయినప్పటికీ వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా కూటమి నేతలు హిందువుల మనోభావాలను కించపరిచేలా, వైసీపీని అప్రతిష్టపాలు చేసే దురుద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ అబద్ధపు ప్రచారానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలపై పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ టీటీడీ ఛైర్మన్లు డా. వై.వి. సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఫోటోలను ఉంచి మరింతగా తప్పుడు ఆరోపణలు మోపుతున్నారని ఆయన విమర్శించారు. కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవాలయాల్లో పూజలు చేసినా, వారి మనస్సులోని నీచమైన ఆలోచనలు మారలేదని అన్నారు.ఇదే క్రమంలో శ్రీ అంబటి రాంబాబు, భూమన కరుణాకర్ రెడ్డి, విడదల రజిని, బ్రహ్మనాయుడు వంటి ప్రతిపక్ష నేతలపై దాడులు చేస్తూ, ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కావాలని శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తున్నారని తమ్మినేని చిరంజీవి నాగ్ ఆరోపించారు.ఈ నేపథ్యంలో మంగళవారం ఆముదాలవలస పోలీస్ స్టేషన్‌లో ముఖ్యమంత్రి మరియు కూటమి నేతలు చేసిన అబద్ధపు ఆరోపణలపై, అలాగే ఎవరి పేరు లేకుండా, ప్రింటింగ్ సంస్థ వివరాలు లేని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఆధ్వర్యంలో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో అణగారిన వర్గాలుగా పేర్కొనే బీసీల గొంతు నొక్కాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తే ప్రజా ప్రతిఘటన తప్పదని వైసీపీ నాయకులు, కలింగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాష్ట్ర కార్యదర్శి దుంపల రామారావు హెచ్చరించారు. పాలన చేయలేని ప్రభుత్వం, బాధ్యత గల ప్రతిపక్షం ప్రజా సమస్యలపై గళం ఎత్తితే దాన్ని అణిచివేసే ప్రయత్నాలు చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు.ప్రతిపక్ష నేతల ఇళ్లపై పెట్రోల్ బాంబు దాడులు, ఇళ్లను తగలబెట్టడం వంటి ఘటనలు ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చ తెస్తాయని అన్నారు. ఇలాంటి గూండాగిరి చర్యలను వైసీపీ తీవ్రంగా ఖండిస్తోందని దుంపల రామారావు అన్నారు ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కే.వి.జి. సత్యనారాయణ మాట్లాడుతూ, 1983 నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఇంతటి అరాచక ప్రభుత్వ పాలనను ఎప్పుడూ చూడలేదన్నారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైన కూటమి ప్రభుత్వం, తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ఎద్దేవా చేశారు.ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్షాన్ని భయపెట్టడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను దాచలేరని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు సర్పంచులు ఎంపీటీసీలు వైసీపీ కేడర్ పాల్గున్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: