Sunday, 02 August 2026 08:33:10 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

ఓర్వకల్లును పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం : మంత్రి టీజీ భరత్ గుప్తా..

Date : 15 May 2026 11:53 AM Views : 60

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా ఓర్వకల్లును రాష్ట్రంలోనే ప్రముఖ పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా పేర్కొన్నారు. శ్రీ మాత్రే ఫుడ్స్ ఆధ్వర్యంలో రూ.10 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేయనున్న ఆధునిక గ్రీన్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు మంత్రి టీజీ భరత్ గుప్తా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఓర్వకల్లులో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధరలు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని తెలిపారు. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లో అరటి, జామ, ఫ్రూట్ పల్ప్‌తో పాటు పలు వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేయనున్నట్లు చెప్పారు. ఈ యూనిట్ ద్వారా రైతులకు మార్కెట్ అవకాశాలు పెరగడంతో పాటు ప్రత్యక్ష, పరోక్షంగా అనేక మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనతో ప్రాంతీయ ఆర్థికాభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. ఓర్వకల్లుకు రానున్న రోజుల్లో రూ.50 వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి టీజీ భరత్ గుప్తా స్పష్టం చేశారు. పారిశ్రామిక వృద్ధి ద్వారా కర్నూలు జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: