Saturday, 01 August 2026 09:54:51 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

నేర నియంత్రణలో రాజీ లేదు – డ్రోన్ పెట్రోలింగ్ ముమ్మరంచేయాలి: కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్...

Date : 25 March 2026 12:28 PM Views : 73

DNB News - ఆంధ్రప్రదేశ్ / : నేర నియంత్రణలో ఎలాంటి రాజీ పడకుండా, నేర నివారణనే ప్రధాన లక్ష్యంగా పోలీసులు సమర్థవంతంగా పనిచేయాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ పోలీసు అధికారులకు ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో నేర నియంత్రణను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ ఘటనలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సమగ్రంగా పరిశీలించి, ప్రాధాన్యత ఉన్న కేసులను 7 రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. రాత్రి గస్తీలు, విజిబుల్ పోలీసింగ్‌ను బలోపేతం చేయాలని, రౌడీ షీటర్లపై నిరంతరం నిఘా ఉంచాలని తెలిపారు. మొబైల్ రికవరీ, రోడ్డు ప్రమాదాల నివారణ, మహిళల భద్రతపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. మార్చి 28 నుంచి క్రికెట్ బెట్టింగ్‌పై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని, డ్రోన్ కెమెరాల సహాయంతో పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని ఆదేశించారు. పెండింగ్ కేసుల దర్యాప్తులను వేగవంతంగా, పకడ్బందీగా పూర్తి చేయాలని తెలిపారు. గత నెలలో వివిధ కేసుల్లో ప్రతిభ కనబరచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, డీఎస్పీలు వెంకట్రామయ్య, ఉపేంద్రబాబు, భార్గవి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: