DNB News - ఆంధ్రప్రదేశ్ / : బక్రీదు పండుగ సందర్భంగా జిల్లాలోని దర్గా, మసీదులు, ఈద్గాల వద్ద పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలతో కలిసి పోలీసులు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పండుగను ప్రజలు శాంతియుత వాతావరణంలో జరుపుకుంటూ పోలీసు శాఖకు సహకరించాలని అధికారులు సూచించారు.
Admin
DNB News