DNB News - ఆంధ్రప్రదేశ్ / : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆదోని పట్టణంలోని బీసీ హాస్టల్‌లో “అమ్మాయిల విద్య – సమాజ అభివృద్ధి” అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాస నర్సింగ్ హోమ్ డాక్టర్ రేష్మ పాల్గొని మాట్లాడారు. విద్యార్థినీలు చదువులో శ్రద్ధ పెడితే వారి కుటుంబంతో పాటు సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం పెరిగిన నేపథ్యంలో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని, సైబర్ క్రైమ్‌లకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చదువు ఎంతో విలువైనదని, దానిని నిర్లక్ష్యం చేయకుండా కృషి చేస్తేనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని విద్యార్థినీలకు ప్రేరణనిచ్చారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ పరిమిల, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, పట్టణ కార్యదర్శి శశిధర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News