DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా ఆయిల్ సీడ్స్ మిషన్ మరియు జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఆయిల్ సీడ్స్ పంటల విస్తరణ, రైతులకు అందిస్తున్న సాంకేతిక సహాయం, అలాగే రైతు సేవా కేంద్రాల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సకాలంలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. రైతు సేవా కేంద్రాలు రైతులకు మార్గదర్శకంగా ఉండాలని, పంటల సాగుకు అవసరమైన సమాచారాన్ని అందిస్తూ రైతులకు ఉపయోగపడే విధంగా కార్యాచరణ చేపట్టాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.
Admin
DNB News