Friday, 18 September 2026 03:23:55 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

ఓటరు జాబితా సవరణ వేగవంతం చేయాలి – బి.ఎల్.ఏల పూర్తి వివరాలు తప్పనిసరి: జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్..

Date : 01 May 2026 11:44 AM Views : 75

DNB News - ఆంధ్రప్రదేశ్ / : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌.ఐ.ఆర్‌)లో పెండింగ్‌లో ఉన్న మ్యాపింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు (బి.ఎల్‌.ఏలు) తమ పూర్తి జాబితాను సమర్పించాలని పాణ్యం నియోజకవర్గం ఎన్నికల అధికారి మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తెలిపారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో పాణ్యం నియోజకవర్గానికి సంబంధించిన ఫారం-6, ఫారం-7, ఫారం-8 మరియు ఎస్‌.ఐ.ఆర్‌కు సంబంధించిన ఎన్నికల అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటరు జాబితా సవరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్‌.ఐ.ఆర్‌ ప్రక్రియలో ఇప్పటివరకు సుమారు 70 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన 30 శాతం పనులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న వాటిలో కొంతమంది ఓటర్లు పక్క నియోజకవర్గాలకు చెందినవారని గుర్తించినట్లు వివరించారు. ఫారం-7 కింద ఇప్పటివరకు సుమారు 2800 మంది ఓటర్ల తొలగింపు ప్రక్రియ పూర్తయ్యిందని, అందులో 1900 మంది డబుల్ ఓటర్లుగా గుర్తించి వారి అభ్యర్థన మేరకు ఒక చోట ఉన్న ఓటును తొలగించినట్లు తెలిపారు. అదేవిధంగా, స్థిర నివాస మార్పు కారణంగా కొంతమంది ఓటర్లు జాబితా నుంచి తొలగించబడగా, సుమారు 350 మంది మరణించిన ఓటర్ల పేర్లు కూడా తొలగించినట్లు చెప్పారు. ఫారం-6 ద్వారా సుమారు 4000 మంది కొత్త ఓటర్లు నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఓటరు జాబితా ఖచ్చితత్వం కోసం రాజకీయ పార్టీలు, బూత్ లెవల్ ఏజెంట్లు మరియు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :