DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఎచ్చెర్ల నియోజకవర్గం ఎచ్చెర్ల గ్రామం లో కొండపైన గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం లో *ఎచ్చెర్ల నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు & వైసీపీ ఇంచార్జ్ గొర్లె కిరణ్ కుమార్ నేత్రత్వం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్త హిందువుల ఆరాధ్య కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదం పై ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు బాధ్యత రాహిత్యం గా వైసీపీ హయాంలో ప్రసాదం లో జంతు కొవ్వు కలిసింది అని ఆరోపించిన నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కేసు సుమోటో గా స్వీకరించి సిబిఐ ఆధ్వర్యంలో సిట్ కమిటీ వేయడం తో సిట్ రిపోర్ట్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు (ndb) వంటి వేర్వేరు సంస్థ ల రిపోర్ట్ లో జంతు కొవ్వు లడ్డు ప్రసాదం లో కలవలేదని నిర్ధారణ చేయడంతో కూటమి ప్రభుత్వం ప్రజల కు, స్వామి వారి భక్తులకు సమాధానం చెప్పలేక ఇంకా తప్పుడు ఆరోపణలు చేయడం అన్యాయం అని అన్నారు,చంద్రబాబు 80 ఏళ్ల వయసు లో దేవుని ప్రసాదం పై తప్పుడు ఆరోపణలు చేయడం అతని నీచ రాజకీయానికి పరాకాష్ట అని అన్నారు చంద్రబాబు కు నిజంగా దేవుని పట్ల భయం భక్తి ఉంటే స్వామి వారి భక్తులమనోభావాలు తో రాజకీయం చేయడు అని అన్నారు, లేని కల్తీ పై విజయవాడ దుర్గ మెట్లు కడిగిన ఓవర్ యాక్షన్ పవన్కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబు నోరు కడగాలని హితవు పలికారు , దేవుని పై భక్తి ఈ కూటమి నాయకులు కంటే మాకు ఎక్కువ ఉందని వీరి స్వార్థ రాజకీయాల కోసం హిందువుల మనోభావాలు పణంగా పెడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు ఈ కార్యక్రమం లో నాలుగు మండలాల ఎంపీపీ జడ్పీటీసీ లు మండల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ అనుబంధ విభాగం అధ్యక్షులు సర్పంచ్ ఎంపీటీసీ లు వివిధ హోదాలలో గల వైసీపీ నాయకులు కార్యకర్తలు భక్తులు పాల్గొన్నారు.
Admin
DNB News