Thursday, 17 September 2026 06:22:35 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

గుత్తావిల్లి లో ఇంటింటికీ NTR భరోసా పెన్షన్ పంపిణీ _ పేద ప్రజలకు ఎల్లవేళలు అండగా కూటమి ప్రభుత్వం__

Date : 28 February 2026 03:38 PM Views : 131

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆముదాలవలస నియోజకవర్గం లో బూర్జ మండలంలోని గుత్తావిల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఇంటింటికీ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఈ రోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమదాలవలస నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ శ్రీ కూన రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు ఇంటి వద్దకే వెళ్ళి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం పట్ల కట్టుబడి ఉందని, అర్హులందరికీ న్యాయం జరిగేలా సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా పారదర్శకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు, విడో మహిళలకి అనేక వర్గాలకు ప్రభుత్వం చేయూతనిస్తోందని పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వం అన్ని వేలలు అండగా ఉంటుందని, ఎవరు నిరాశ చెందవద్దని ఎమ్మెల్యే రవికుమార్ హామీ ఇచ్చారు కూటమి ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజు నుండే వృద్ధులుకి 4000, వికలాంగులకు 6000, శాశ్వత వికలాంగులకు 15000 రూపాయలు ఇస్తున్నాం అని తెలిపారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ డైరెక్టర్ శ్రీ ఆనెపు రామకృష్ణ నాయుడు , మాజీ ఎమ్మెల్సీ శ్రీ పీరుకట్ల విశ్వప్రసాద్ గా సర్పంచ్ ప్రతినిధి హనుమంతు గోపి మాస్టర్ ,స్థానిక కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు , గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ గ్రామం లో పెన్షన్ అందుకున్న వృద్ధులు, మహిళలు ఎమ్మెల్యే కి కూటమి ప్రభుత్వానికి ,గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :