DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో 150 పడకల విశ్రాంతి భవనం నిర్మాణానికి శనివారం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి. భరత్ గుప్త పాల్గొన్నారు. అలాగే పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఎండీ వంశీ రామ్ మోహన్ బుర్రా, సంబంధిత శాఖల అధికారులు హాజరై నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సర్వజన ఆసుపత్రికి వచ్చే రోగుల బంధువులకు విశ్రాంతి భవనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఆధునిక సౌకర్యాలతో నిర్మించనున్న ఈ భవనం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందనున్నాయని పేర్కొన్నారు.
Admin
DNB News