Saturday, 01 August 2026 09:02:32 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

ఏబీసీ క్యాంపు క్వార్టర్స్ ఖాళీ చేయించేందుకు చర్యలు వేగవంతం..

Date : 12 May 2026 10:51 AM Views : 65

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు నగరంలోని ఏ, బి, సి క్యాంపు క్వార్టర్స్‌లో అనధికారికంగా నివాసముంటున్న వారిని ఖాళీ చేయించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్‌తో కలిసి ఆర్ అండ్ బి, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఏబీసీ క్యాంపు ప్రాంతంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, అందుకు అనధికారిక ఆక్రమణలను తొలగించడం అవసరమని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఖాళీ చేయించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి మాట్లాడుతూ, ఏబీసీ క్యాంపు క్వార్టర్స్‌లో అనధికారికంగా నివాసముంటున్న వారు ఈ నెల 25వ తేదీలోపు స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బి ఎస్ఈ మహేశ్వర రెడ్డి, కర్నూలు మున్సిపల్ కమిషనర్ ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనురాధ, ఆర్ అండ్ బి ఈఈ సునీల్ రెడ్డి, కర్నూలు అర్బన్ తహసీల్దార్ రవి, కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు, కర్నూలు రూరల్ తహసీల్దార్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :