Wednesday, 16 September 2026 01:43:50 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

పాండవగల్లు పెద్ద చెరువు కేసులో అధికారుల నిర్లక్ష్యం – తక్షణ జోక్యం కోరిన సీపీఎం..

Date : 24 March 2026 10:25 AM Views : 118

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని మండలం పాండవగల్లు గ్రామంలో సర్వే నంబర్ 135లో ఉన్న 20 ఎకరాలకు పైగా విస్తరించిన పెద్ద చెరువు కేసు విషయంలో రెవెన్యూ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని సీపీఎం నాయకులు విమర్శించారు. ఈ సమస్యపై తక్షణమే కోర్టులో జోక్యం చేసుకుని కేసును పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే. వెంకటేశులు, మండల కార్యదర్శి కే. లింగన్న ఆధ్వర్యంలో నాయకులు ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టి, సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సబ్ కోర్టు మరియు జిల్లా స్థాయి కోర్టులు ఈ చెరువును ప్రభుత్వ చెరువుగా గుర్తిస్తూ ఇప్పటికే తీర్పులు ఇచ్చినప్పటికీ, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇప్పటివరకు స్వాధీనం చేసుకోలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆక్రమణదారు 2013లో హైకోర్టును ఆశ్రయించడంతో కేసు పెండింగ్‌లో ఉందన్నారు. రెవెన్యూ అధికారులు సకాలంలో చర్యలు తీసుకోకపోవడం వల్ల 2023 ఆగస్టు తర్వాత కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఈ పరిస్థితికి అధికారుల నిర్లక్ష్య వైఖరే కారణమని ఆరోపించారు. కావున ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే జోక్యం చేసుకుని పాండవగల్లు పెద్ద చెరువు కేసును పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గ్రామస్తులతో కలిసి భారీ స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు జే. రామాంజనేయులు, గోవిందు, అనీఫ్ బాషా, హనుమంత్ రెడ్డి, నాగరాజు, అలాగే గ్రామ రైతులు రామాంజనేయ, పకీరయ్య, దేవయ్య, శుభం కుమార్ స్వామి, నరసప్ప, కుప్పయ్య భోజరాజు తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :