Sunday, 02 August 2026 09:30:41 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

మహిళల భద్రత మనందరి బాధ్యత – అవగాహన పెరిగితేనే నేరాలకు చెక్.. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్..

Date : 06 May 2026 10:15 AM Views : 58

DNB News - ఆంధ్రప్రదేశ్ / : మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు అవగాహన అత్యంత ముఖ్యమని, మహిళల భద్రత మనందరి బాధ్యత అని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ తెలిపారు. మంగళవారం ఆలూరు మండల కేంద్రంలోని ఇబ్రహీం ఫంక్షన్ హాల్‌లో “మీ రక్షణ – మా బాధ్యత” పేరుతో మహిళల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని తెలిపారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా సంకోచం లేకుండా పోలీసులను సంప్రదించాలని మహిళలకు పిలుపునిచ్చారు. చట్టాలపై అవగాహన పెరిగితేనే నేరాలు తగ్గుతాయని పేర్కొన్నారు. మహిళల రక్షణ కోసం దేశంలో అనేక చట్టాలు అమల్లో ఉన్నాయని, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచే మహిళలకు ఓటు హక్కు, ఆస్తిలో సమాన హక్కులు కల్పించారని తెలిపారు. పోక్సో చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, నిర్భయ చట్టం వంటి పలు చట్టాలు మహిళల రక్షణకు దోహదపడుతున్నాయని వివరించారు. పని ప్రదేశాల్లో గానీ, సమాజంలో గానీ మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా వెంటనే పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. భయపడకుండా ముందుకు వస్తేనే చట్టాల పరిరక్షణ లభిస్తుందని తెలిపారు. జిల్లా పోలీసు శాఖ మహిళలపై నేరాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. పోలీస్ స్టేషన్‌కు రాకుండానే సహాయం పొందేందుకు “శక్తి యాప్” వంటి ఆధునిక సాంకేతిక సదుపాయాలను మహిళలు వినియోగించుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ యాప్ ద్వారా తక్షణ సహాయం పొందవచ్చని తెలిపారు. మహిళలు ఎటువంటి వేధింపులు ఎదుర్కొన్నా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, డయల్ 112, 181, 1098, 1930 హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించుకోవాలని సూచించారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :