Thursday, 17 September 2026 05:14:56 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

మహిళల మరుగుదొడ్ల నిర్మాణంలో నిర్లక్ష్యం… మున్సిపల్ కార్యాలయంపై ముట్టడి హెచ్చరిక – బీజేపీ ఆగ్రహం..

Date : 24 March 2026 10:26 AM Views : 105

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో మహిళల కోసం మరుగుదొడ్ల నిర్మాణం ఆలస్యం అవుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. BJP ఏపి రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ ఆదేశాల మేరకు, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ వాల్మీకి పార్థసారథి సూచనలతో ప్రతి సోమవారం నిర్వహించే “జనతా వారధి” కార్యక్రమంలో భాగంగా ఆదోని సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు వినితా గుప్తా, తోవి నాగార్జున, మహదేవ్, గోపి, ఉషారాజ్ మాట్లాడుతూ—ఆదోని పట్టణంలోని ఝాన్సీ లక్ష్మీబాయి కూరగాయల మార్కెట్ సమీపంలో GB కాంప్లెక్స్ పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంలో, చిన్న మార్కెట్ ప్రాంతంలో మరియు మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో మహిళల మరుగుదొడ్ల నిర్మాణానికి రెండేళ్ల క్రితమే ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడం బాధాకరమని అన్నారు. మరుగుదొడ్ల నిర్మాణానికి మంజూరైన నిధులపై స్పష్టత లేకపోవడం, స్థలాల్లో పనులు ప్రారంభం కాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. మహిళల గౌరవం, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అలాగే అత్యవసరంగా మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెనుకాడబోమని గట్టిగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో AV సురేష్ (వార్డ్ మాజీ కౌన్సిలర్, కర్నూలు జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు), చంద్ర, రామకృష్ణ, మాధవి, ప్రశాంత్, మహేష్ నాయక్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: