Sunday, 02 August 2026 09:08:33 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

షాహీ జామియా మస్జిద్ ఆస్తులపై అక్రమాలపై విచారణ కోరుతూ సబ్-కలెక్టర్‌కు వినతి..

Date : 15 April 2026 10:53 AM Views : 129

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలోని షాహీ జామియా మస్జిద్ ఆస్తులు, ఆదాయం మరియు నిర్వహణలో జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్న అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ బీజేపీ మైనారిటీ నాయకులు సబ్-కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆదోనికి చెందిన బి. జాఫర్ మాట్లాడుతూ, సుమారు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన షాహీ జామియా మస్జిద్‌కు దాదాపు ₹1000 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నప్పటికీ, వాటి నిర్వహణలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని తెలిపారు. మస్జిద్ ఆస్తులు ఒకే వ్యక్తి ఆధీనంలో ఉండటం, వాటిలో కొంత భాగం బంధువుల పేర్లకు మార్చబడినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. గత 10 సంవత్సరాలుగా ఆస్తుల వివరాలు, ఆదాయం-వ్యయాల సమాచారం ప్రజలకు వెల్లడించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మస్జిద్‌కు వచ్చే ఆదాయంలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయని, అధికారిక రశీదుల్లో తక్కువ మొత్తమే చూపిస్తూ మిగిలిన మొత్తాన్ని వ్యక్తిగత ఖాతాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. అలాగే, ప్రతి ఐదు సంవత్సరాలకు జరగాల్సిన కమిటీ ఎన్నికలను ఆలస్యం చేస్తూ అదే వ్యక్తి పదవిలో కొనసాగుతున్నారని పేర్కొన్నారు. ఈ అంశాలపై ప్రశ్నించిన వారిని బెదిరింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయని తెలిపారు. ప్రజల డిమాండ్లు: మస్జిద్ ఆస్తుల పూర్తి వివరాలను వెంటనే ప్రజలకు వెల్లడించాలి అక్రమంగా బదిలీ చేసిన ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకోవాలి మస్జిద్ ఆదాయాన్ని ప్రతి నెల ప్రజలకు తెలియజేయడానికి డిస్‌ప్లే బోర్డ్ ఏర్పాటు చేయాలి కనీసం 10 మంది సభ్యులతో రక్షణ కమిటీ ఏర్పాటు చేయాలి మస్జిద్ కమిటీ ఎన్నికలను తక్షణమే నిర్వహించాలి ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, మస్జిద్ పవిత్రతను కాపాడాలని వారు అధికారులను కోరారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :