DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా, మంత్రాలయం నియోజకవర్గం, కౌతాళం మండలం కౌతాళం గ్రామంలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 41వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం మరియు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బాలింతలకు కాయగూరలు, బ్రెడ్‌లు, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా బాలింతల ఆరోగ్యానికి తోడ్పడాలనే ఉద్దేశంతో అభిమానులు ముందుకు రావడం విశేషం. ఈ కార్యక్రమంలో కౌతాళం మండలం రామ్ చరణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు అశోక్ నాయకత్వంలో ఉపాధ్యక్షుడు అవినీష్, లక్ష్మమ్మ, గుడి వీరేష్, ఉరుకుంద మారెప్ప, ఎం. రాజు, ఎం. బీమా గోవిందు, ఉరుకుంద పెద్ద మారెప్ప, ఎస్. చరణ్, ఎస్. శివరాజ్, ఎం. సురేష్, ఎం. సునీల్, పి. చిన్న, రాఘవేంద్ర, సోము, ఈరన్న, ఎస్. అసిస్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామస్థులు ఈ సేవా కార్యక్రమాన్ని అభినందించారు.
Admin
DNB News