Monday, 03 August 2026 01:28:02 AM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

పోరాటమే పునాది.. ప్రజా సంక్షేమమే ధ్యేయం! పోరాటం నుంచి పుట్టిన శక్తి!

Date : 12 March 2026 03:04 PM Views : 167

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఇది కేవలం ఒక పార్టీ జెండా కాదు, కోట్లాది మంది ప్రజలు తమ భుజాలెత్తి మోస్తున్న ఎజెండా. అన్యాయాలను ఎదుర్కుంటూ .. కుట్రలను తట్టుకుంటూ ప్రజా నమ్మకం - ప్రజా బలంతో ఎదిగిన పార్టీ . దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల సాధన కోసం , ప్రజా సమస్యల పరిష్కారమే ద్యేయంగా, రాష్ట్ర అభివృద్దే లక్ష్యంగా ఏర్పడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 15 వసంతాలు పూర్తి చేసుకన్న సందర్భంగా శ్రీకాకుళం నగరంలో నవభారత్ జంక్షన్ వద్ద పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్) , రాష్ట్ర కళింగ కార్పొరేషన్ మాజీ చైర్మన్, రాష్ట్ర కళింగ సామాజిక వర్గ అధ్యక్షులు దుంపల రామారావు పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 16 సంవత్సరాల ప్రయాణంలో వైసిపి పార్టీ అనేక పోరాటాలు ,విజయాలను సాధించిందన్నారు. పార్టీ అధినేత ,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంతో పోరాటాల మధ్య పుట్టిన ఈ పార్టీ ప్రజల ఆశీర్వాదంతోనే ఎదిగిందన్నారు. పేద ప్రజలు , రైతులు , బడుగు ,బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా వైసీపీ పార్టీ పనిచేస్తుందన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చూపిన సంక్షేమ పాలనను కొనసాగిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా శ్రేయస్సే ముఖ్యమని జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. గత 16 సంవత్సరాల పార్టీ ప్రయాణం ఎన్నో సవాళ్లతో కూడుకున్నాదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆరంభం నుండి రాజకీయ ఒత్తిడులు , రాజకీయ అవరోధాలు , కక్ష సాధింపులని ఎదుర్కొని వైసిపి పార్టీ ప్రజా మద్దతుతో బలపడిందన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నిన ప్రజల మనసుల్లో వైసిపి పార్టీ పట్ల విశ్వాసాన్ని తొలగించలేరని హితువు పలికారు.రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రతీ ఒక్కరూ సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా రామారావు పిలుపునిచ్చారు.....

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :