Saturday, 19 September 2026 08:34:10 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

రైతన్నల సంక్షేమమే లక్ష్యం.. మరింత అంకితభావంతో పనిచేస్తా – మంత్రి అచ్చెన్నాయుడు

Date : 26 March 2026 06:00 PM Views : 112

DNB News - ఆంధ్రప్రదేశ్ / : అమ‌రావ‌తి, మార్చి 26: వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పుట్టినరోజు సందర్భంగా అమరావతిలోని సచివాలయంలో సీఎం ఛాంబర్‌లో మంత్రుల సమక్షంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా కేక్ కట్ చేయించి మంత్రి అచ్చెన్నాయుడికి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే యువనేత, మంత్రి నారా లోకేష్ సమక్షంలో క్యాబినెట్ మంత్రులంతా కలిసి కేక్ కట్ చేసి మంత్రి అచ్చెన్నాయుడికి తినిపిస్తూ ఆత్మీయ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి అచ్చెన్నాయుడు చేసిన కృషిని ముఖ్యమంత్రి చంద్ర‌బాబు కొనియాడారు. సుదీర్ఘకాలంగా ఎమ్మెల్యేగా ప్రజల అభ్యున్నతికై నిత్యం ఆలోచిస్తూ, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆయా శాఖల అభివృద్ధికి పాటుపడి రాష్ట్ర పురోగతికి బాటలు వేసిన నాయకుడిగా ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర క్యాబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ సమక్షంలో తన జన్మదిన వేడుకలు జరగడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి తనపై ప్రత్యేక వాత్సల్యంతో స్వయంగా కేక్ కట్ చేయించి ఆశీర్వదించడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ వేడుకలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన యువనేత నారా లోకేష్, మంత్రివర్గ సహచరులు, ప్రజాప్రతినిధులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :