DNB News - ఆంధ్రప్రదేశ్ / : ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమదాలవలస ఎమ్మెల్యే శ్రీ కూన రవికుమార్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజధాని *రాయపూర్*లో *రాయపూర్ ఆంధ్ర తెలుగు సమాజ్ – రాయపూర్ కళింగ సమాజ్ సంయుక్త ఆధ్వర్యంలో ఆత్మీయ కలయిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి *ఆమదాలవలస ఎమ్మెల్యే, **రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల కమిటీ ఛైర్మన్* *శ్రీ కూన రవికుమార్ * ముఖ్య అతిథిగా హాజరై, తెలుగు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలుగు ప్రజల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటాం : కూన రవికుమార్ రాయపూర్‌లో నివసిస్తున్న తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా విని, వాటికి పరిష్కారం కోసం *తన వంతు పూర్తి సహకారం అందిస్తానని* ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్‌లో స్థిర నివాసం ఏర్పరచుకున్న తెలుగు ప్రజల సమస్యలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి**, *ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి తో చర్చించి శాశ్వత పరిష్కారం చూపుతామని* తెలిపారు. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా వారి అభివృద్ధి, సంక్షేమమే తన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కి ఘన సన్మానం ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ కూన రవికుమార్ ని రాయపూర్‌లోని తెలుగు సంఘాలు *భారీఎత్తున, అత్యంత ఘనంగా సన్మానించాయి*. వివిధ సంఘాల ప్రతినిధులు, పెద్దలు ఎమ్మెల్యే సేవలను కొనియాడుతూ, తెలుగు ప్రజల పట్ల చూపుతున్న చిత్తశుద్ధికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు *ఛత్తీస్‌గఢ్ కళింగ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు* – గౌరీ శంకర్ *రాయపూర్ కళింగ సంఘం అధ్యక్షుడు* – సనపల జగదీష్ రావు ప్రధాన కార్యదర్శి** – హిమగిరి *ఆంధ్రా సంఘం అధ్యక్షుడు – జి. స్వామి *TWS అధ్యక్షుడు* – టి. గోపి *బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు* – సత్యం అయ్యప్ప షోలాపురి మఠ కమిటీ సభ్యులు* కళింగ, ఆంధ్రా సంఘాల కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు ఐక్యతకు ప్రతీకగా ఆత్మీయ కలయిక తెలుగు ప్రజల ఐక్యత, సాంస్కృతిక విలువల పరిరక్షణే లక్ష్యంగా ఈ ఆత్మీయ కలయిక కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.
Admin
DNB News