DNB News - ఆంధ్రప్రదేశ్ / : పురాతన భారతీయ వైద్య విధానం 'ఆయుర్వేదం' కేవలం భారత్‌కే పరిమితం కాకుండా, ఖండాంతరాలు దాటి తన ప్రాభవాన్ని చాటుతోంది. తాజాగా, చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు మండలం కొలమాసన పల్లి పంచాయతీ విరూపాక్షపురంలోని మోహన్‌రావు ఆయుర్వేద కేంద్రం అంతర్జాతీయ స్థాయిలో నమ్మకాన్ని చూరగొంటూ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. కొంతకాలం క్రితం దక్షిణాఫ్రికాకు చెందిన ఓ వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మోహన్‌రావు ఆయుర్వేద కేంద్రాన్ని సందర్శించారు. ఇక్కడి సంప్రదాయ వైద్య చికిత్సలు, నిపుణుల పర్యవేక్షణలో ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. స్వదేశానికి తిరిగి వెళ్లిన సదరు వ్యక్తి, మోహన్‌రావు కేంద్రంలో తనకు లభించిన చికిత్సను, ఆదరణను అక్కడి వారికి వివరించారు. ఆయన ఇచ్చిన భరోసా, చూపిన ఫలితాల కారణంగా.. ఈరోజు దక్షిణాఫ్రికా నుండి మరో రోగి ప్రత్యేకంగా చికిత్స కోసం ఈ కేంద్రానికి తరలివచ్చారు. మౌఖిక ప్రచారం (Word of Mouth) ద్వారా ఒక విదేశీయుడు మరొకరిని ఇక్కడికి సిఫార్సు చేయడం ఆయుర్వేదంపై వారికి ఉన్న నమ్మకానికి నిదర్శనం. ప్రపంచాన్ని కలుపుతున్న విరూపాక్షపురం సాంప్రదాయ వైద్య పద్ధతులకు నిలయమైన ఈ కేంద్రం, ఆధునిక ప్రపంచానికి ప్రకృతి సిద్ధమైన వైద్యాన్ని అందిస్తోంది. ఈ సందర్భంగా కేంద్రం ప్రతినిధులు మోహన్ రావ్ కుమార్ డాక్టర్ అశ్విని (BAMS) మాట్లాడుతూ, విదేశాల నుండి రోగులు మాపై నమ్మకంతో రావడం మాకు ఎంతో గర్వకారణం. రోగుల పట్ల మేము చూపే శ్రద్ధ, వారు పొందుతున్న ఫలితాలే మమ్మల్ని ప్రపంచ పటంలో నిలుపుతున్నాయి. దక్షిణాఫ్రికా రోగుల రాక మా బాధ్యతను మరింత పెంచిందన్నారు.
Admin
DNB News