Friday, 18 September 2026 08:20:12 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప

Date : 15 June 2026 10:34 AM Views : 155

DNB News - తెలంగాణ / : మధుమేహ వ్యాధి దేశంలో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆధునిక వైద్య విధానాలు, తాజా పరిశోధనలపై వైద్యులు నిరంతరం అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప అన్నారు. ఆదివారం కరీంనగర్‌లోని ప్రతిమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పిమ్స్)లో నిర్వహించిన "పంచమ్-2026" డయాబెటిస్ వైద్య శాస్త్రీయ సదస్సులో ఆమె మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య నిపుణులు, ప్రొఫెసర్లు, పీజీ విద్యార్థులు, ఇంటర్న్‌లు, వైద్య విద్యార్థులతో కలిపి సుమారు 800 మంది ప్రతినిధులు పాల్గొనడం సంతోషకరమన్నారు. ప్రస్తుతం మధుమేహం ప్రధాన ప్రజారోగ్య సమస్యగా మారిందని, ఐసీఎంఆర్ అధ్యయనాల ప్రకారం దేశంలో మధుమేహం, ప్రీ-డయాబెటిస్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని తెలిపారు. తక్కువ వయస్సులోనే మధుమేహం బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో నివారణ, ముందస్తు గుర్తింపు, సమర్థవంతమైన చికిత్సపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సదస్సులో డయాబెటిస్ చికిత్సలో తాజా పురోగతులు, కొత్త చికిత్సా విధానాలు, సాంకేతిక ఆవిష్కరణలు, క్లిష్ట వైద్య పరిస్థితుల నిర్వహణ వంటి అంశాలపై నిపుణులు చర్చించడం వైద్య రంగానికి ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. శాస్త్రీయ చర్చలు, అనుభవాల మార్పిడి ద్వారా రోగులకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించగలమని ఆమె అన్నారు. మధుమేహ చికిత్సతో పాటు వ్యాధి నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించడం కూడా వైద్యుల సామాజిక బాధ్యత అని డా. జి. దీప పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రతిమ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.ఎల్ జాన్ ఇజ్రాయిల్, డాక్టర్ డీసీ తిరుపతి రావు, ఆర్గనైజింగ్ చైర్మెన్ డాక్టర్ ఎం విజయ్ మోహన్ రెడ్డి, డాక్టర్ సిఎల్ ప్రసాద్, సీఈఓ రామచంద్రం రావు, డాక్టర్ రఘురామ రెడ్డి, డాక్టర్ కుమార్ నేత, ప్రతిమ జనరల్ వైద్య బృందం, మరియు విద్యార్థులు, ప్రతిమ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :