DNB News - తెలంగాణ / : తెలంగాణలో మావోయిస్టుల భారీ లొంగుబాటు జరగబోతోంది. ముఖ్యమంత్రి A. Revanth Reddy సమక్షంలో నేడు మొత్తం 124 మంది మావోయిస్టులు లొంగిపోనున్నట్లు సమాచారం. ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు అనధికార చీఫ్ దేవ్‌జీకి చెందిన పీఎల్‌జీఏ కమాండర్ టీమ్‌తో పాటు మొత్తం 124 మంది మావోయిస్టులు ప్రభుత్వం ఎదుట లొంగిపోనున్నట్లు తెలుస్తోంది. ఈ లొంగుబాటుకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించనున్న మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది. తెలంగాణలో శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడుతున్న నేపథ్యంలో మావోయిస్టుల ఈ భారీ లొంగుబాటు కీలక పరిణామంగా భావిస్తున్నారు.
Admin
DNB News