Monday, 03 August 2026 03:11:20 AM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

మంగ్లీపై ఆరోపణల్ని ఖండిస్తున్నాం..అడ్వకేట్స్ అసోసియేషన్ నాయకులు భూక్యా హరినాయక్

Date : 18 April 2026 05:51 PM Views : 67

DNB News - తెలంగాణ / : బంజారా బిడ్డ, ప్రముఖ సింగర్ మంగ్లీపై కొంతమంది కావాలనే ఆరోపణలు చేస్తున్నారని, వాటిని ఖండిస్తున్నామని బంజారా అడ్వకేట్స్ అసోసియేషన్ నాయకులు, న్యాయవాది భూక్యా హరినాయక్ పేర్కొన్నారు. ఖమ్మంలోని ప్రెస్ క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంగ్లీపై ఘోరాతిఘోరమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తప్పు జరిగిందని తెలిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి, సాక్ష్యాలను చూపాలి. కోర్టు శిక్షిస్తుంది. అలాగాకుండా వీుడియా సమావేశం పెట్టి చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. మంగ్లీ భవిష్యత్‌ను దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రలో భాగమే ఇదంతా అని ఆరోపించారు. ప్రధాన నిందితుడిని విచారించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. కంపెనీలో మంగ్లీ వాటా ఉందా, బోర్డు డైరెక్టర్‌గా ఉందా అనే విషయాలు తేలకుండా ఆమెపై ఎలా ఆరోపణలు చేస్తారని ప్రశ్నించారు. నిన్ను వదలనంటూ ఏకవచనంతో మాట్లాడడం సరికాదని, న్యాయవాద వృత్తికే సుబ్బారావు కళంకం తెస్తున్నాడని ఆరోపించారు. సాక్ష్యాలు ఉంటే పోలీసులకు అప్పగిస్తే వారే విచారణ జరుపుతారని అన్నారు. అలాగాకుండా బంజారా బిడ్డపై అవాస్తవమైన, అసత్యమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. ధరావత్ వీరన్న మాట్లాడుతూ మంగ్లీ ప్రతిష్టను దిగజార్చేందుకు కొంతమంది కుట్ర చేస్తున్నారని అన్నారు. తానే బాధితుల తరుపున ఉంటానని మంగ్లీ చెప్పిందనే విషయం గుర్తు చేసుకోవాలన్నారు. న్యాయవాది బాణోత్ మణిమాల మాట్లాడుతూ మంగ్లీపై ఆరోపణలు బంజారా జాతికి ఘోరమైన అవమానమన్నారు. బెట్టింగ్ యాప్స్‌లో ఉన్న వారిపై చర్యలు తీసుకోవడం చేతకాదని, ట్యాక్స్‌లకు కట్టకుండా తప్పించుకు తీరుగుతున్న వారిని ఏం చేయలేకపోతున్నారని, దేశంలో నెంబర్‌వన్ సింగర్‌గా ఎదుగుతున్న బంజారా బిడ్డపై మాత్రం అవాస్తవమైన ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. లంబాడీలపై ఎందుకు కక్ష్య కట్టారని ప్రశ్నించారు. వాస్తవాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో ప్రచారం చేయవద్దని సూచించారు. మంగ్లీపై లేనిపోని అరోపణలు చేస్తే బంజారా జాతి చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఈ సమావేశంలో న్యాయవాదులు తేజావత్ నర్సింహ, ధరావత్ ప్రసాద్, నునావత్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: