Sunday, 02 August 2026 10:41:03 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

శాతవాహనలో పరిశుభ్రతపై ఆరోగ్య అవగాహన కార్యక్రమం ఆరోగ్యకరమైన జీవితం అందరికీ అవసరం- బోయినపల్లి హరిణి పరిశుభ్రత వల్లనే ఆరోగ్య జీవన శైలి - ఆచార్య ఉమేష్

Date : 22 April 2026 11:34 AM Views : 61

DNB News - తెలంగాణ / : శాతవాహన విశ్వవిద్యాలయంలో డా. బి.ఆర్. అంబేడ్కర్ లైబ్రరీ ఆడిటోరియం లో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో "హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రాం ఆన్ హైజిన్" కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన రిజిస్ట్రార్ ఆచార్య సతీష్ కుమార్ మాట్లాడుతూ పరిశుభ్రత పాటించడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని, వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా ఎంతో ముఖ్యమని వివరించారు. ఈ కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య యు. ఉమేష్ కుమార్ విశిష్ట అతిథిగా విచ్చేసి వ్యక్తిగత పరిశుభ్రత, ఆహార ప్రాముఖ్యత, ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యాధుల నివారణ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలని విశ్వవిద్యాలయంలో క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించాలన్నారు. ప్రతిమా ఫౌండేషన్ ఫౌండర్ & డైరెక్టర్ డా. బోయినపల్లి హరిణి మాట్లాడుతూ విశ్వవిద్యాలయ విద్యార్థులు తమ చదువుతోపాటు ఆరోగ్యాన్ని కూడా క్రమశిక్షణగా ఉంచుకోవాలని, యువత తమ శరీరంలో ముందస్తుగా వచ్చే అనేక వ్యాధులపై అవగాహన కల్పించుకొని ఆరోగ్యకరమైన జీవితం గడపడానికి ప్రయత్నం చేయాలని, మన తోటి వారికి అవగాహన కల్పించాలని తెలియజేస్తూ ప్రతిమ ఫౌండేషన్ తరపున వాడిన శానిటరీ పాడ్ల,వ్యర్దాలని నాశనం చేసే ఇన్సినిరేటర్ యంత్రాలను బహుకరించారు. గౌరవ అతిధిగా విచ్చేసిన డేర్మాటలోజిస్ట్ ఆచార్య గీతా రెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయ యువత తమ ఆరోగ్యం పట్ల అవగాహనతో పాటు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని జంక్ ఫుడ్ ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దని మానసిక ఆరోగ్యం కోసం శారీరక ఆరోగ్యాన్ని పెంచుకోవాలని మహిళలు తమ ఆరోగ్యం పట్ల శరీరంలో వచ్చే మార్పుల పట్ల జాగ్రత్తతో ఉండాలని మనం తినే ఆహార పదార్థాల వల్లనే శరీరంలో క్యాన్సర్ కారకాలు ఉత్పన్నమవుతున్నాయని, బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కల్పించారు. డా. సత్య ప్రభ, గైనకాలజీ విభాగాధిపతి మాట్లాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యువత జాగ్రత్తలు తీసుకోవాలని, మంచి ఆరోగ్య అలవాట్లు జీవితాన్ని ఆనందమయం చేస్తాయని సూచించారు. కన్వీనర్ చీఫ్ వార్డెన్ డా. నజిముద్దీన్ మునవర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం విశ్వవిద్యాలయ విద్యార్థులకు ఆరోగ్య అవగాహన పెంపొందించడానికి దోహదపడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్, న్యాయ కళాశాల ప్రిన్సిపల్ డా.పద్మావతి, డా.నమ్రత, డా.జయంతి, సావిత్రి, అధ్యాపకులు, సైన్స్, ఆర్ట్స్, కామర్స్, న్యాయ కళాశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :