DNB News - తెలంగాణ / : DNB న్యూస్ ఛానల్ సూర్యాపేట జిల్లా కోదాడ రాయల సతీష్ రిపోర్టర్ 6/3/2026 పదవ తరగతి పరీక్షలు సమర్పిస్తున్న సందర్భంగా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, మోటివేషన్ కల్పించడం కోసం జిల్లా ఎస్పీ నర్సింహ గారి ఆదేశాల మేరకు ఈరోజు మునగాల పోలీసులు మండల పరిధిలో గల కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల నందు విద్యార్థినిలకు లక్ష్యాలు సాధించడం అంశంపై అవగాహన కల్పించారు. సందర్భంగా ఎస్సై ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యం ఏర్పాటు చేసుకుని చదవాలని లక్ష్యం కోసం నిరంతర కృషి సాధన చేయాలని కోరారు. పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్న మన విద్యార్థులు ఆందోళన చెందకుండా ఒత్తిడికి గురవ్వకుండా మనసుపెట్టి చదవాలని మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరారు. సందిగ్ధమున్న పాఠ్యాంశాలపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలని కోరారు. శ్రద్ధతో ఇష్టంతో చదివితే ఏదైనా సాధించవచ్చు అని సూచించారు. పరీక్షలు బాగా రాసి మంచి ఉత్తీర్ణత సాధించి విద్యనుభ్యసిస్తున్న పాఠశాలకు పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Admin
DNB News