Friday, 17 April 2026 05:07:53 PM
# ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం # ప్రాణహాని బెదిరింపుల నేపథ్యంలో పోలీసు రక్షణ కోరిన బి. జాఫర్.. # “మీ రక్షణ – మా బాధ్యత” అవగాహన ర్యాలీకి శ్రీకారం – మహిళల భద్రతపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిలుపు.. # 10 సూత్రాల అమలుపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి.. # సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ # ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ

డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు కీలకం : వైరా ఏసీపీ సారంగపాణి

Date : 26 March 2026 05:56 PM Views : 25

DNB News - తెలంగాణ / : డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు చాలా కీలకమైనదని, కంటి చూపు బాగుంటేనే వాహనాన్ని సమర్థవంతంగా నడపగలుగుతారని వైరా ఏసీపీ సారంగపాణి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా కొనసాగుతున్న అరైవ్ అలైవ్ మూడోవ విడత అవగాహన కార్యక్రమంలో భాగంగా.. వైరా ఏసీపీ పర్యవేక్షణలో తల్లాడ హైవే లో వెళ్తున్న భారీ వాహనాల డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు ఎల్ వి ప్రసాద్ ఐ హాస్పిటల్ సహకారంతో తల్లాడ పోలీస్ స్టేషన్లో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో, లారీ, ట్రాక్టర్, కారు డ్రైవర్లకు రోడ్డు భద్రతలో పాటించాల్సిన నియమాలపై సమగ్రంగా వివరించారు. ఈ శిబిరం ద్వారా 110 మందికి పైగా డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన సూచనలు ఇచ్చారు. వయస్సు పెరిగే కొద్ది కంటి చూపు మందగించడం సహజమని, క్రమం తప్పకుండా కంటి వైద్య పరీక్షలు నిర్వహించుకుని తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కంటి చూపు స్పష్టంగా ఉంటే ట్రాఫిక్ సిగ్నల్స్, రహదారి సూచనలు సరిగ్గా గుర్తించి సురక్షితంగా వాహనాలు నడపగలరని తెలిపారు. చాలా మంది డ్రైవర్లు కంటి చూపును అశ్రద్ధ చేస్తున్నారనే ఉద్దేశంతో కంటి పరీక్షలు నిర్వహించిన‌ట్లు తెలిపారు. కార్యక్రమంలో వైరా ఇన్స్పెక్టర్ వెంకటప్రసాద్, ఎస్సై వెంకటకృష్ణ లు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :