Tuesday, 03 November 2026 12:56:11 PM
# మద్యం మత్తులో హెడ్ మాష్టార్ బాగోతం..!! # అసైన్డ్, చుక్కల, ఇనాం, పట్టా భూములపై..ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..!! # ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికకు రేపు ఈ-లాటరీ..!! # వచ్చే ఏడాది ఎలక్షన్స్.. 2.29కోట్ల ఓట్లు డిలీట్..!! # సి మల్లవరం హైవే ప్రాంతంలో హత్య చేయబడ్డ యువతి వి. భాగ్యశ్రీ (26) గా గుర్తింపు..!! # అగ్నివీరులకు కేంద్రం గుడ్‌న్యూస్.. నాలుగేళ్ల సర్వీస్‌పై కీలక నిర్ణయం..!! # తెలంగాణలో వానల బీభత్సం.. రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్..!! # ORR బ్రిడ్జి కింద ట్రాన్సో జెండర్ స్వీటీ ఆత్మహత్య..!! # ఏపీలో మరో విషాదం.. కేజీబీవీ హాస్టల్‌లో విద్యార్థిని మృతి..!! # విద్యార్థుల అందరి సమస్యలపై భవిష్యత్తు పోరాటాల బాధ్యత మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ దే..... MRPS ఖమ్మం నగర కో ఇంచార్జ్ బాకీ శ్రీను మాదిగ # మహిళా రక్షణ, సైబర్ భద్రతపై షీ టీమ్స్ అవగాహన..!! # కంట్లో మొలకెత్తిన విత్తనం..!! # సీఐపై కత్తితో దాడి.. అందుకే కాల్పులు: ఎస్పీ జగదీష్ # హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయ్..!! # తెలంగాణలోని ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. భారీ నుంచి అతిభారీ వర్షాలు..!! # బోరబండలో బిడ్డను చంపిన తండ్రి..? # ఏడాదికి రూ.12వేలు.. NOV 15 వరకు ఛాన్స్..!! # రోహిత.. నువ్వు గ్రేట్ తల్లి..!! # హైదరాబాద్ లో ఇలాంటి ఫుడ్ ఆహ్..? # హైదరాబాద్ లో 36 గంటలు వాటర్ బంద్..!!

CP Sajjanar: పెట్రోల్ టెన్షన్ వద్దు.. హైదరాబాద్‌లో 60 రోజులకు సరిపడా నిల్వలు!

Date : 26 March 2026 04:39 PM Views : 108

DNB News - తెలంగాణ / : CP Sajjanar: పెట్రోల్ టెన్షన్ వద్దు.. హైదరాబాద్‌లో 60 రోజులకు సరిపడా నిల్వలు! CP Sajjanar: గత కొన్ని రోజులుగా నగరంలో ఇంధన కొరత ఏర్పడనుందనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ స్పందిస్తూ.. నగరంలో ఇంధన కొరత ఉందనే వార్తలు పూర్తిగా అవాస్తవమని, అవి కేవలం పుకార్లు మాత్రమేనని స్పష్టం చేశారు. 60 రోజులకు సరిపడా నిల్వలు నగర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీపీ భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌లో రాబోయే 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 22న 3,024 KL ఇంధన విక్రయాలు జరగగా, వదంతుల కారణంగా 23వ తేదీ నాటికి అవి ఏకంగా 6,400 KLకి పెరిగాయి. ఒకేసారి ప్రజలందరూ బంకులకు వచ్చి ఫుల్ ట్యాంకులు చేయించుకోవడం వల్ల ఏర్పడిన అత్యధిక డిమాండ్ కారణంగానే కొన్ని చోట్ల తాత్కాలికంగా 'నో స్టాక్' బోర్డులు కనిపిస్తున్నాయని ఆయన వివరించారు. ఇంధన సరఫరా వ్యవస్థ నిరాటంకంగా కొనసాగుతోందని, ఆయిల్ కంపెనీలతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నామని సీపీ తెలిపారు. అయితే, బాటిళ్లు మరియు డబ్బాల్లో లూజ్ ఇంధనాన్ని విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వారిపై పోలీసుల నిఘా ఉంటుందని సజ్జనర్ పేర్కొన్నారు. నగరవ్యాప్తంగా ఉన్న 240 పెట్రోల్ బంకులపై పోలీసులు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రజలు శాంతంగా ఉండాలని, అనవసరంగా ఫుల్ ట్యాంకులు చేయించుకుని సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెంచవద్దని ఈ సందర్భంగా సీపీ విజ్ఞప్తి చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: