Saturday, 19 September 2026 08:41:48 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

ఇంటర్ ఫలితాల్లో మైనారిటీ గురుకుల విద్యార్థులకు మెరుగైన ఫలితాలు .

Date : 20 April 2026 06:09 PM Views : 106

DNB News - తెలంగాణ / : మైనార్టీ గురుకుల కళాశాలను విద్యార్థినీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి... మైనార్టీ గురుకుల కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పడిశెట్టి సంపత్.. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన 2026 విద్య సంవత్సరానికి సంబందించిన ప్రథమ , ద్వీతీయ సంవత్సర ఫలితాల్లో మైనారిటీ గురుకుల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని తెలంగాణ మైనారిటీ గురుకుల కళాశాల మానకొండూర్ బాలుర -1 ప్రిన్సిపాల్ డాక్టర్ పిడిశెట్టి సంపత్ తెలిపారు. ఎంపీసీ / బైపీసీ విభాగంలో హుజురాబాద్ బాలుర కళాశాలలో ద్వీతీయ సంవత్సరంలో ఎన్.రాజకుమార్ స్వామి 948 /1000 , అంజన్న 900 /1000 ఎం.రాహుల్ 916 /1000 , శ్రీనాథ్ రెడ్డి 913 /1000 అలాగే ప్రథమ సంవత్సరంలో మొహమ్మద్ హనీఫ్ 447 /470 , మొహమ్మద్ సమీర్ 445 /470 , షేర్ ఖాన్ 431 /440 , పి.రోహిత్ 431 /440 మార్కులు సాధించారని ప్రిన్సిపాల్ కుమారస్వామి తెలిపారు. ఆర్ట్స్ విభాగంలో మానకొండూర్ బాలుర కళాశాలలో ప్రథమ సంవత్సరంలో మనోజ్ 460 /500 , ఎండీ. రెహాన్ 446 /500 , రాజేష్ 442 /500 , ఎం.సాగర్ 433 /500 ద్వీతీయ సంవత్సరంలో ఎండీ. అష్రాఫ్ 866 /1000 , సి.హెచ్ చందు 857 /1000 , డి.అభిషేక్ 828 /1000 మార్కులు సాధించారని ప్రిన్సిపాల్ డాక్టర్ పిడిశెట్టి సంపత్ తెలిపారు. అదేవిధంగా బాలికల కళాశాలల్లో కరీంనగర్ గర్ల్స్ -2 ఎంపీసీ / బైపీసీ విభాగంలో ద్వీతీయ సంవత్సరంలో తబస్సుమ్ లారా 988 /1000 ,అఫ్రీన్ ఫాతిమా 982 /1000, సాజిదా 981 /1000 ఆలాగే 900 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు సంఖ్య గణనీయంగా ఉన్నారని ప్రథమ సంవత్సరంలో అలీజా మరియం 459 /470 , మెహరోజ్ తంకీన్ 458 /470 , షైక్ సుహానా 450 /470 లతో 400 పైగా మార్కులు సాధించిన వారు 30 మంది ఉన్నారని ప్రిన్సిపాల్ ఎన్. సరిత ఈ సందర్భంగా తెలిపారు. ఆర్ట్స్ విభాగంలో చొప్పదండి బాలికల కళాశాలలో ద్వీతీయ సంవత్సరంలో జాస్మిన్ 965 /1000 , మౌనిక 959 /1000 , పావని 957 /1000 , శీరీన్ 950 /1000 , రుత్విక 933 /1000 మార్కులు సాధించారని ప్రిన్సిపాల్ జి.వారుణీ తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ పిడిశెట్టి సంపత్ మాట్లాడుతూ విద్యార్థులు కృషి , ఉపాధ్యాయుల అంకితభావం, క్రమశిక్షణతో కూడిన విద్య విధానం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు. మైనారిటీ గురుకులాల కో ఆర్డినేటర్ రమేష్ లాల్ హత్కర్, విజిలెన్సు అధికారులు ఎం.డి . అక్రమ్ పాషా, ఇంతియాజ్ అలీ , అకాడమిక్ కో ఆర్డినేటర్ ఎం.డి మీరాజ్, ఉపాద్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులను అభినందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మైనారిటీ గురుకులాల సొసైటీ అధ్యక్షులు ఫహీమ్ ఖురేషి, సెక్రటరీ బి. షఫీఉల్లా , డి.ఐ .ఓ సుభాన్ లకు ప్రిన్సిపాళ్లు కృతఙ్ఞతలు తెలిపారు.మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాలు కొనసాగుతున్నాయని ఇట్టి అవకాశాన్ని మైనారిటీలు వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 7995057932 కు సంప్రదించాలని కోరారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: