Friday, 18 September 2026 07:14:20 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

Date : 04 April 2026 06:28 PM Views : 104

DNB News - తెలంగాణ / : భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఇందులో భాగంగా ప్రజలకు పారదర్శకంగా సులభతరమైన సేవలు అందించడానికి ల్యాండ్ సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు క్రిందకు తెస్తూ ఇంటిగ్రేటెడ్ భూ భారతి పోర్టల్ ను ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ క్రింద ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలంలో ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తహసిల్దార్ కార్యాలయం వద్ద భూములు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో సర్వే మ్యాప్ లు అందించే దిశగా ఇంటిగ్రేటెడ్ భూ భారతి పోర్టల్ రూపొందించామని అన్నారు. కూసుమంచి మండలంలో ఇక నుంచి రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకుంటే ఆ వివరాలు సర్వేయర్ కు కూడా వెళ్తుందని అన్నారు.  రైతులు ఇంటి వద్ద నుంచి కూడా స్లాట్ బుకింగ్ చేసుకునేలా పోర్టల్ తయారు చేశామని, రైతులు లాగిన్ కాగానే భూమి వివరాలు కనిపిస్తాయని, ఎన్ని ఎకరాలకు సర్వే కావాలో కోరితే అందుకు సంబంధించిన ఫీజు చెల్లించిన తర్వాత గ్రామంలోని లైసెన్స్ సర్వేయర్ లాగిన్ కు వెళ్తాయని, రెండు రోజుల్లో ఆ రైతు భూమికి ఆనుకొని ఉన్న రైతులకు నోటీసులు జారీ చేసి ఏడు రోజుల లోపు సర్వే పూర్తి చేస్తారని,  ఈ వివరాలను సర్వేయర్ సిస్టంలో నమోదు చేశాక దరఖాస్తుదారుడైన రైతు సర్వే మ్యాప్ నకు యూనిక్, భూధార్ నెంబర్లు కేటాయిస్తారని భూభారతి పోర్టల్ లో కూడా వివరాలు నిక్షిప్తమవుతాయని అన్నారు. సర్వే పూర్తయిన తర్వాత సర్వే మ్యాప్ జనరేట్ చేసి పోర్టల్ లో అప్లోడ్ చేస్తారని ఈ ప్రక్రియలు దరఖాస్తు రిజిస్ట్రేషన్ ప్రారంభమైనప్పటి నుంచి పూర్తి వరకు ప్రతి దశలో పౌరుల రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు మెసేజ్ వస్తాయని తెలిపారు.  పైలెట్ ప్రాజెక్టు క్రింద ముందుగా కూసుమంచి మండలంలో ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ అమలు చేస్తున్నామని ఇక్కడ వచ్చే ఫలితాల ఆధారంగా భవిష్యత్తులో మిగిలిన మండలాలకు దీనిని ప్రభుత్వం విస్తరిస్తుందని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: