DNB News - తెలంగాణ / : పాల్వంచలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఇంద్ర మహిళ క్యాంటీన్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, పూలతో నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు వారసుల ఐక్యవేదిక వ్యవస్థాపకులు వానపాకుల రాంబాబు సారథ్యంలో జరిగింది. కార్యక్రమంలో మహిళా నాయకురాలు పూణెం సీత, సరస్వతి, నక్క లావణ్య, రేణుక, పాయం పాపయ్య దొర, మెంతిని సమ్మయ్య, ఎస్.కె. యాకోబు, డిష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆలోచనలు సమాజానికి మార్గదర్శకమని పేర్కొంటూ, ఆయన ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నాయకులు తెలిపారు. పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు “జై భీమ్ – జై జై భీమ్” నినాదాలతో వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పాల్గొన్నవారు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు వారసుల ఐక్యవేదిక వ్యవస్థాపకులు వానపాకుల రాంబాబు సారథ్యంలో జరిగింది. కార్యక్రమంలో మహిళా నాయకురాలు పూణెం సీత, సరస్వతి, నక్క లావణ్య, రేణుక, పాయం పాపయ్య దొర, మెంతిని సమ్మయ్య, ఎస్.కె. యాకోబు, డిష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News